MSTC
-
1.46 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయిన ఎమ్‌ఎస్‌టీసీ ఐపీఓ
న్యూఢిల్లీ: ఎమ్‌ఎస్‌టీసీ కంపెనీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) 1.46 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబయింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ 1.76 కోట్ల షేర్లను జారీ చేస్తోంది. దీనికి గాను 2.58 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. ఈ నెల 13న ప్రారంభమైన ఈ ఐపీఓ గత శుక్రవారమే ముగియాల్సి ఉంది. స్పందన పెద్దగా లేకపోవడంతో ఈ ఐపీఓను బుధవారం వరకూ పొడిగించారు. ప్రైస్‌బ్యాండ్‌ను కూడా రూ.121–128 నుంచి రూ.120–128కు సవరించారు. అయినా అంతంత మాత్రం స్పందన మాత్రమే లభించింది. ఈ కంపెనీ షేర్లు ఈ నెల 29న తేదీన స్టాక్ మార్కెట్లో లిస్టయ్యే అవకాశాలున్నాయి. ట్రేడింగ్ కంపెనీగా 1964లో ఏర్పాటైన ఈ కంపెనీ ప్రస్తుతం మూడు విభాగాల్లో–ఈ కామర్స్, ట్రేడింగ్, రీసైక్లింగ్ల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. -
ఎయిరిండియా ఆస్తుల విక్రయం షురూ!
♦ వివిధ నగరాల్లోని ఫ్లాట్లు, స్థలాలు, భవంతులకు ఈ–వేలం ♦ బిడ్ల దాఖలుకు ఆఖరు తేదీ వచ్చేనెల 6 ♦ రూ.500 కోట్లు లభిస్తాయని అంచనా ముంబై: ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా... దేశవ్యాప్తంగా తనకున్న ఆస్తుల్లో కొన్నింటిని అమ్మకానికి పెట్టింది. ఎయిరిండియాకు దేశమంతటా విపరీతమైన ఆస్తులున్న నేపథ్యంలో... వాటిని విక్రయించి సంస్థకున్న అప్పుల్లో కొన్నిటిని తీర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఆ తరువాత ఆస్తులు మినహా ఎయిరిం డియా విమానాలను, బ్రాండ్‌ను, కార్యకలాపాలను ఏదో ఒక కంపెనీకి విక్రయించే అవకాశమున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఇందులో భాగంగానే ఆస్తుల విక్రయం మొదలైనట్లు భావిస్తున్నారు. సంస్థకు పుణె, అహ్మదాబాద్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై, తిరువనంతపురం, గోవా, లక్నో, గ్వాలియర్, గుర్గావ్, భుజ్ ప్రాంతాల్లో ఉన్న 27 రెసిడెన్షియల్ ఫ్లాట్లు, విల్లాలు, కమర్షియల్ ప్లాట్లు, స్థలాలు, ఆఫీసు భవంతులను తాజాగా అమ్మకానికి పెట్టారు. ఈ విక్రయం ద్వారా కనీసం రూ. 500 కోట్లు సమకూరుతాయని సంస్థ భావిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఈ ఆస్తులకు ఈ–వేలం నిర్వహించనుండగా... బిడ్ల దాఖలుకు చివరి తేదీని సెప్టెంబర్ 6గా నిర్ణయించారు. కంపెనీని పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఇప్పటికే ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రక్రియకు కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రస్తుతం ఆర్థిక మంత్రి జైట్లీ సారథ్యంలోని మంత్రుల బృందం కసరత్తు చేస్తోంది. 2017 మార్చి ఆఖరుకి ఎయిరిండియా మొత్తం రుణభారం రూ.48,879 కోట్లు. గతేడాది కంపెనీ నికర నష్టం రూ. 3,643 కోట్లకు తగ్గగా.. నిర్వహణ లాభం రూ. 300 కోట్లుగా నమోదైంది. మరో కింగ్ఫిషర్లా కానివ్వం: మంత్రి అశోక్ ఎయిరిండియాను మరో కింగ్‌ఫిషర్ ఎయిర్లైన్స్లా మారనివ్వబోమని పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక గజపతి రాజు స్పష్టం చేశారు. ఉద్యోగులను ఇంటికి పంపాలని తాము కోరుకోవడం లేదన్నారు. -
ఎంఎస్టీసీతో మహీంద్రా జట్టు...
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ సంస్థ ‘ఎంఎస్టీసీ’తో మహీంద్రా గ్రూప్‌కు చెందిన ‘మహీంద్రా ఇంటర్‌ట్రేడ్’ సంస్థ జతకట్టింది. ఇరు సంస్థల నడుమ ఒప్పందం ప్రకారం.. ఇవి జాయింట్ వెంచర్ ద్వారా దేశంలో ‘ఆటో ష్రెడ్డింగ్ అండ్ రీసైక్లింగ్ ప్లాంట్’ను ఏర్పాటు చేస్తాయి. ‘దేశంలో ఆటో స్క్రాప్ పదార్థాల వినియోగం సంవత్సరానికి 5-6 మిలియన్ టన్నులుగా ఉంది. దీని మార్కెట్ రూ.12,000 కోట్లుగా ఉండొచ్చని అంచనా. -
మహీంద్రా ఆటో ష్రెడ్డింగ్ ప్లాంట్ ఏర్పాటు
ఎంఎస్టీసీ భాగస్వామ్యంతో.. న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్‌కు చెందిన మహీంద్రా ఇంటర్‌ట్రేడ్ సంస్థ, ప్రభుత్వ రంగంలోని ఎంఎస్టీసీతో కలసి ఆటోమొబైల్ ష్రెడ్డింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నది. దీనికి సంబంధించి రెండు కంపెనీల మధ్య ఒప్పందం కుదిరిందని మహీంద్రా ఇంటర్‌ట్రేడ్ ఒక ప్రకటనలో తెలిపింది. కాలం చెల్లిన వాహనాలను తుక్కుగా మార్చి, రీసైక్లింగ్ చేసే ఈ ప్లాంట్ పూర్తిగా ఆటోమేటెడ్ అని, భారత్‌లో ఇలాంటి ప్లాంట్ ఇదే మొదటిదని మహీంద్రా ఇంట్రాట్రేడ్ ఎండీ సుమీత్ ఇసార్ పేర్కొన్నారు. రీసైక్లింగ్ కారణంగా ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా ఇతర వనరులను కనిష్ట స్థాయిలో వినియోగించుకోవచ్చని వివరించారు. కాలం చెల్లిన వాహనాలను వినియోగించరాదనే అంశంపై ప్రభుత్వం దృష్టిసారిస్తోందని తెలిపారు. ఈ ప్లాంట్ పాత వాహనాల ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్ రబ్బర్ స్క్రాప్‌ల నుంచి తగిన స్థాయిల్లో ఆయా పదార్ధాలను రికవర్ చేస్తుందని వివరించారు. తుక్కును రీసైకిల్ చేయడం, పర్యావరణ పరిరక్షణ విషయంలో ఎంఎస్టీసీ వినూత్నమైన విధానాలనే అవలంభిస్తుందని, దాంట్లో భాగంగానే ఈ ప్లాంట్ ఏర్పాటని ఎంఎస్టీసీ ఎండీ ఎస్.కె. త్రిపాఠి పేర్కొన్నారు.