నేడే మ్యాక్స్ ఇండియా లిస్టింగ్
న్యూఢిల్లీ: మ్యాక్స్ ఇండియా గురువారం స్టాక్ మార్కెట్లో లిస్టవుతోంది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో తమ షేర్లు లిస్ట్ కానున్నట్లు మ్యాక్స్ ఇండియా తెలిపింది. మ్యాక్స్ ఇండియా డీమెర్జ్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్లో లిస్టవుతున్న మూడో మ్యాక్స్ గ్రూప్ కంపెనీ ఇది. ఈ ఏడాది జనవరిలో మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జూన్‌లో మ్యాక్స్ వెంచర్స్ అండ్ ఇండస్ట్రీస్ స్టాక్ మార్కెట్లో లిస్టయ్యాయి. గతంలో మ్యాక్స్ హెల్త్‌కేర్, మ్యాక్స్ బుపా హెల్త్ ఇన్సూరెన్స్, అంటారా సీనియర్ లివింగ్ కంపెనీలకు హోల్డింగ్ కంపెనీగా మ్యాక్స్ ఇండియా లిమిటెడ్ వ్యవహరించేది. మ్యాక్స్ గ్రూప్ జీవిత బీమా, ఆరోగ్య సంరక్షణ సంబంధిత వ్యాపారాలు, ప్యాకేజింగ్ రంగాల్లో పనిచేస్తోంది.