‘వీఎస్‌టీ’ మినీ ట్రాక్టరు | mini tractors show by iyengar | Sakshi
Sakshi News home page

‘వీఎస్‌టీ’ మినీ ట్రాక్టరు

Published Tue, Apr 22 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:20 AM

‘వీఎస్‌టీ’ మినీ ట్రాక్టరు

‘వీఎస్‌టీ’ మినీ ట్రాక్టరు

సాక్షి ప్రతినిధి, బెంగళూరు : చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగపడే నాలుగు చక్రాల మినీ ట్రాక్టరును వీఎస్‌టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ సోమవారం ఇక్కడ ప్రదర్శించింది. వ్యవసాయ యంత్రాలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 25న హొసూరులో కర్మాగారాన్ని స్థాపించనున్న సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బీసీఎస్. అయ్యంగార్ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 14.6 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో ఈ కర్మాగారాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.
 
రెండు మోడళ్లలో లభ్యమయ్యే ఈ ట్రాక్టర్లు చిన్న, సన్న కారు రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. వ్యవసాయ కార్మికులు దొరకని ప్రస్తుత తరుణంలో ఈ ట్రాక్టర్ల ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. మహారాష్ట్రలో వైన్ యార్డులలో, గుజరాత్ పత్తి పంటలపై పిచికారీకి వినియోగించడం ద్వారా ఈ ట్రాక్టర్లు రైతుల ఆదరణ పొందాయని చెప్పారు. విభిన్న స్వభావం కలిగిన వీటి ద్వారా వ్యవసాయంలో వివిధ పనులకు వినియోగించుకోవచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement