ఆగస్ట్‌లో పవర్ టిల్లర్లు, ట్రాక్టర్ల విక్రయాలు 57 శాతం జంప్‌చేసి 3,535 యూనిట్లను తాకినట్లు వెల్లడించడంతో వ్యవసాయ పరికరాల కంపెనీ వీఎస్‌టీ టిల్లర్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. తొలుత ఎన్‌ఎస్‌ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 1,770ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 2.2 శాతం లాభపడి రూ. 1676 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌లో 2,638 పవర్ టిల్లర్స్‌తోపాటు.. 897 ట్రాక్టర్లను విక్రయించినట్లు వీఎస్‌టీ టిల్లర్స్ తెలియజేసింది. ఈ ఏడాది తొలి 5 నెలల్లో 10,864 పవర్ టిల్లర్స్, 3,513 ట్రాక్టర్ల అమ్మకాలు సాధించినట్లు వివరించింది.
ఇండియామార్ట్ ఇంటర్‌మెష్
ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించడం, ఎస్‌ఎంఈలు డిజిటల్ టెక్నాలజీవైపు మళ్లడం వంటి సానుకూల అంశాలతో ఇటీవల జోరు చూపుతున్న ఇండియామార్ట్ ఇంటర్‌మెష్ కౌంటర్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్‌ఎస్‌ఈలో తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 4,220ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 4,176 వద్ద ట్రేడవుతోంది. ఎస్‌ఎంఈలు అధికంగా వినియోగించే ఆన్‌లైన్ బీటూబీ క్లాసిఫైడ్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా నిలుస్తుండటం ద్వారా కంపెనీ మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడు రోజులుగా ఈ కౌంటర్ లాభాలతో కదులుతోంది. గత రెండు నెలల్లోనే ఈ షేరు 98 శాతం ర్యాలీ చేయడం విశేషం!
సీజీ పవర్
ఇప్పటికే ఈక్విటీ షేర్లు, వారంట్ల ద్వారా కంపెనీలో రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతిపాదించిన ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్ బోర్డు తాజాగా మరో రూ. 100 కోట్ల పెట్టుబడులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో సీజీ పవర్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 22.35 వద్ద ఫ్రీజయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment