vst tillers tractors limited
-
మయూర్- వీఎస్టీ టిల్లర్స్ జూమ్
ముంబై: తొలుత వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టాలను అందుకున్నదేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అంచనాలకు తగిన పనితీరు చూపడంతోపాటు.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించిన వార్తలతో మయూర్ యూనికోటర్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వీఎస్టీ టిల్లర్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ నికర లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 30 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు సైతం 37 శాతం పెరిగి రూ. 220 కోట్లను తాకాయి. ఇబిటా మార్జిన్లు 5.9 శాతం బలపడి 17.1 శాతానికి చేరాయి. పవర్ టిల్లర్ అమ్మకాలు 41 శాతం అధికంగా 7,924 యూనిట్లను తాకగా.. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 25 శాతం వృద్ధితో 2,751 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో కంపెనీ రూ. 140 కోట్ల నగదును సముపార్జించింది. ఫలితాల నేపథ్యంలో వీఎస్టీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 1,939ను తాకింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 1,911 వద్ద ట్రేడవుతోంది. మయూర్ యూనికోటర్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో మయూర్ యూనికోటర్స్ నికర లాభం 9 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం తక్కువగా రూ. 126 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు 5.6 శాతం బలపడి 23 శాతానికి చేరాయి. కాగా.. షేరుకి రూ. 400 ధర మించకుండా కంపెనీ ఈక్విటీలో 1.65 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు మయూర్ యూనికోటర్స్ తెలియజేసింది. ఇందుకు రూ. 30 కోట్లవరకూ వెచ్చించనుంది. ఈ నేపథ్యంలో మయూర్ యూనికోటర్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 275ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 267 వద్ద ట్రేడవుతోంది. -
డిక్సన్ టెక్- వీఎస్టీ టిల్లర్స్.. దూకుడు
ఆటుపోట్ల మధ్య కదులుతున్న మార్కెట్లలో సానుకూల వార్తల కారణంగా అటు డిక్సన్ టెక్నాలజీస్, ఇటు వీఎస్టీ టిల్లర్స్ కౌంటర్లకు డిమాండ్ కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఒడిదొడుకుల మార్కెట్లోనూ భారీ లాభాలతో కళకళలాడుతున్నాయి. వెరసి ఎలక్ట్రానిక్ ప్రొడక్టుల కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరర్ డిక్సన్ టెక్నాలజీస్ షేరు సరికొత్త గరిష్టాన్ని తాకితే.. వ్యవసాయ రంగ పరికరాలు, ట్రాక్టర్ల కంపెనీ వీఎస్టీ టిల్లర్స్ తాజాగా 52 వారాల గరిష్టానికి గరిష్టానికి చేరింది. ఇకపై ఈ రెండు కంపెనీలూ మెరుగైన పనితీరు చూపగలవన్న అంచనాలు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. వివరాలు చూద్దాం.. డిక్సన్ టెక్నాలజీస్ ఈ ఏడాది మార్చి 24న రూ. 2,900 వద్ద కనిష్టాన్ని చవిచూసిన డిక్సన్ టెక్నాలజీస్ ర్యాలీ బాటలో సాగుతోంది. తాజాగా ఎన్ఎస్ఈలో 3 శాతం ఎగసి రూ. 8,850 వద్ద ట్రేడవుతోంది. తొలుత 4 శాతంపైగా జంప్‌చేసి రూ. 8,940ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ఇటీవలి కనిష్టం నుంచి ఏకంగా 208 శాతం ర్యాలీ చేసింది. దేశీ ఎలక్ట్రానిక్ మార్కెట్లో పలు విభాగాల్లో కంపెనీ కాంట్రాక్ట్ మ్యాన్యుఫాక్చరింగ్ సర్వీసులను అందిస్తోంది. ఎంఎన్‌సీలు తదితర దిగ్గజాలకు ప్రొడక్టులను తయారు చేస్తోంది. కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయెన్సెస్, మొబైల్ ఫోన్లు, లెడ్ లైటింగ్ తదితర విభాగాలలో కార్యకలాపాలు విస్తరించింది. వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ గత ఐదు రోజుల్లో 18 శాతం బలపడిన వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ మరోసారి పుంజుకుంది. ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 2.5 శాతం పెరిగి రూ. 1860 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 1924 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. ఆగస్ట్ నెలలో ట్రాక్టర్లు, టిల్లర్ల విక్రయాలు ఊపందుకోవడంతో ఇటీవల ఈ కౌంటర్ జోరు చూపుతున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. గత నెలలో ప్రధానంగా టిల్లర్ల అమ్మకాలు దాదాపు 84 శాతం జంప్‌చేసి 2,638 యూనిట్లకు చేరడంతో ఇన్వెస్టర్లు ఈ కౌంటర్‌పై దృష్టి సారించినట్లు తెలియజేశారు. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 813 యూనిట్ల నుంచి 897 యూనిట్లకు పెరగడం గమనార్హం! -
ఇండియామార్ట్- వీఎస్టీ టిల్లర్స్ హైజంప్
ఆగస్ట్‌లో పవర్ టిల్లర్లు, ట్రాక్టర్ల విక్రయాలు 57 శాతం జంప్‌చేసి 3,535 యూనిట్లను తాకినట్లు వెల్లడించడంతో వ్యవసాయ పరికరాల కంపెనీ వీఎస్టీ టిల్లర్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. తొలుత ఎన్ఎస్ఈలో 7 శాతం జంప్‌చేసి రూ. 1,770ను తాకింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. తదుపరి కొంత వెనకడుగు వేసింది. ప్రస్తుతం 2.2 శాతం లాభపడి రూ. 1676 వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌లో 2,638 పవర్ టిల్లర్స్తోపాటు.. 897 ట్రాక్టర్లను విక్రయించినట్లు వీఎస్టీ టిల్లర్స్ తెలియజేసింది. ఈ ఏడాది తొలి 5 నెలల్లో 10,864 పవర్ టిల్లర్స్, 3,513 ట్రాక్టర్ల అమ్మకాలు సాధించినట్లు వివరించింది. ఇండియామార్ట్ ఇంటర్మెష్ ఈ ఏడాది క్యూ1లో పటిష్ట ఫలితాలు సాధించడం, ఎస్ఎంఈలు డిజిటల్ టెక్నాలజీవైపు మళ్లడం వంటి సానుకూల అంశాలతో ఇటీవల జోరు చూపుతున్న ఇండియామార్ట్ ఇంటర్మెష్ కౌంటర్ మరోసారి దూకుడు చూపుతోంది. ఎన్ఎస్ఈలో తొలుత 11 శాతం దూసుకెళ్లి రూ. 4,220ను తాకింది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 4,176 వద్ద ట్రేడవుతోంది. ఎస్ఎంఈలు అధికంగా వినియోగించే ఆన్లైన్ బీటూబీ క్లాసిఫైడ్ విభాగంలో మార్కెట్ లీడర్‌గా నిలుస్తుండటం ద్వారా కంపెనీ మెరుగైన పనితీరు ప్రదర్శిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. మూడు రోజులుగా ఈ కౌంటర్ లాభాలతో కదులుతోంది. గత రెండు నెలల్లోనే ఈ షేరు 98 శాతం ర్యాలీ చేయడం విశేషం! సీజీ పవర్ ఇప్పటికే ఈక్విటీ షేర్లు, వారంట్ల ద్వారా కంపెనీలో రూ. 700 కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు ప్రతిపాదించిన ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ బోర్డు తాజాగా మరో రూ. 100 కోట్ల పెట్టుబడులకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించడంతో సీజీ పవర్ ఇండస్ట్రియల్ సొల్యూషన్స్ కౌంటర్ వెలుగులోకి వచ్చింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్ఎస్ఈలో ఈ షేరు 5 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 22.35 వద్ద ఫ్రీజయ్యింది. -
‘వీఎస్టీ’ మినీ ట్రాక్టరు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగపడే నాలుగు చక్రాల మినీ ట్రాక్టరును వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ సోమవారం ఇక్కడ ప్రదర్శించింది. వ్యవసాయ యంత్రాలకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 25న హొసూరులో కర్మాగారాన్ని స్థాపించనున్న సందర్భాన్ని పురస్కరించుకుని సంస్థ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ బీసీఎస్. అయ్యంగార్ ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. 14.6 ఎకరాల్లో రూ.70 కోట్ల వ్యయంతో ఈ కర్మాగారాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. రెండు మోడళ్లలో లభ్యమయ్యే ఈ ట్రాక్టర్లు చిన్న, సన్న కారు రైతులకు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. వ్యవసాయ కార్మికులు దొరకని ప్రస్తుత తరుణంలో ఈ ట్రాక్టర్ల ద్వారా ఆ సమస్యను అధిగమించవచ్చని తెలిపారు. మహారాష్ట్రలో వైన్ యార్డులలో, గుజరాత్ పత్తి పంటలపై పిచికారీకి వినియోగించడం ద్వారా ఈ ట్రాక్టర్లు రైతుల ఆదరణ పొందాయని చెప్పారు. విభిన్న స్వభావం కలిగిన వీటి ద్వారా వ్యవసాయంలో వివిధ పనులకు వినియోగించుకోవచ్చని చెప్పారు.