
టూరిస్టుల లిస్టులో ముంబై, చెన్నై!
ఆసియా– పసిఫిక్ టాప్–20 జాబితాలో చోటు
న్యూఢిల్లీ: ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని టాప్–20 పర్యాటక ప్రాంతాల జాబితాలో ముంబై, చెన్నై పట్టణాలు స్థానం దక్కించుకున్నాయి. మాస్టర్‌కార్డ్ ఆసియా– పసిఫిక్ పర్యాటక ప్రాంతాలు–2017 జాబితా ప్రకారం..
♦ గతేడాది మొత్తంగా దాదాపు 34 కోట్ల మంది అంతర్జాతీయ పర్యాటకులు ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోని 171 పర్యాటక ప్రాంతాలను (22 దేశాలు) సందర్శించారు. వీరిలో ఎక్కువ మందికి బ్యాంకాక్ గమ్యస్థానంగా మారింది. 1.93 కోట్ల మంది పర్యాటకులు బ్యాంకాక్‌కు వెళ్లారు. దీంతో ఇది జాబితాలో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
♦ 1.31 కోట్ల మంది టూరిస్ట్‌లతో సింగపూర్ రెండో స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో టోక్యో (1.26 కోట్ల మంది), సియోల్ (1.24 కోట్ల మంది), కౌలాలంపూర్ (1.13 కోట్ల మంది) ఉన్నాయి.
♦ ఇక మన చెన్నై 52 లక్షల మంది పర్యాటకుల రాకతో 14వ స్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబై 49 లక్షల మంది టూరిస్ట్‌లతో 15వ స్థానంలో నిలిచింది.
ఎన్‌టీపీసీ మసాలా బాండ్లు రూ. 2000 కోట్ల సమీకరణ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజ విద్యుత్ రంగ కంపెనీ ఎన్‌టీపీసీ తాజాగా మసాలా బాండ్ల జారీ ద్వారా రూ.2,000 కోట్లను సమీకరించింది. మూలధన అవసరాల కోసం నిధులను సమీకరించినట్లు కంపెనీ తెలిపింది. దేశంలో కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు, ఇదివరకటి పవర్ స్టేషన్ల పునరుద్ధరణకు తాజాగా సేకరించిన నిధులను వినియోగిస్తామని పేర్కొంది.
2022, మే 3ను మెచ్యూరిటీ తేదీగా కలిగిన ఈ బాండ్ల వడ్డీ రేటు వార్షికంగా 7.25% ఉందని తెలియజేసింది. ఇవి రూపీ బాండ్లే అయినా... మెచ్యూరిటీ మొత్తం, వడ్డీ చెల్లింపులు డాలర్ల రూపంలోనే జరుగుతాయని సంస్థ తెలిపింది. కాగా ఈ బాండ్లు సింగపూర్, లండన్ ఎక్సే్చంజ్‌లలో లిస్ట్ అవుతాయి.