ఐటీ పెట్టుబడుల కోసం రాష్ట్రాల పోటీ | Nasscom members meeting with AP,Telangana CM's | Sakshi
Sakshi News home page

ఐటీ పెట్టుబడుల కోసం రాష్ట్రాల పోటీ

Published Fri, Sep 26 2014 1:26 AM | Last Updated on Mon, Apr 8 2019 7:52 PM

ఐటీ పెట్టుబడుల కోసం రాష్ట్రాల పోటీ - Sakshi

ఐటీ పెట్టుబడుల కోసం రాష్ట్రాల పోటీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లో ఐటీ రంగం వేగంగా వృద్ధి చెందనుందని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) పేర్కొంది. అంబానీ సోదరులు ఇద్దరు విడిపోయిన తర్వాత రిలయన్స్  వ్యాపారం ఏ విధంగా విస్తరించిందో అదే విధంగా రెండు రాష్ట్రాలు కూడా ఐటీ రంగంలో దూసుకుపోతాయన్న ధీమాను నాస్కామ్ వైస్ చైర్మన్ బి.వి.ఆర్. మోహన్ రెడ్డి తెలిపారు. 1800 మంది సభ్యులు కలిగిన నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం గురువారం హైదరాబాద్‌లో జరిగింది.

 కౌన్సిల్ సభ్యులతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులు ఇద్దరూ చెరో సమయంలో సమావేశమయ్యారు. అనంతరం మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడటం ద్వారా అంతిమంగా తెలుగు ప్రజలు ప్రయోజనం పొందుతారన్నారు.  నాస్కామ్ రెండు రాష్ట్రాల్లో అవకాశాలపై దృష్టి పెడుతుందన్నారు.

 పల్లెలకు ఐటీ ఫలాలు: సీఎం చంద్రబాబు
 గ్రామీణ ప్రాంతాలకు ఐటీ సేవలను అందించడానికి సహాయం చేయాల్సిందిగా నాస్కామ్ ప్రతినిధులను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. నాస్కామ్ ప్రతినిధులను కలిసిన అనంతరం కలిసిన విలేకరులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే విధంగా ఐటీని ప్రోత్సహించడం,  గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ కనెక్షన్స్ ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలన్న అంశాలపై చర్చించినట్లు తెలిపారు. రాజధాని కూడా లేని రాష్ట్రం కాబట్టి కొన్ని ఇబ్బందులున్నా అన్ని వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు.

 ఇప్పటికే టెక్ మహీంద్రా, విప్రో వంటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని, మరిన్ని కంపెనీలు ఏపీకి క్యూ కట్టే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ప్రారంభ కంపెనీలను ప్రోత్సహించడం కోసం నాస్కామ్ భాగస్వామ్యంతో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇంకుబేషన్ సెంటర్‌ను సెప్టెంబర్ 29న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ప్రచారం చేస్తున్న డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాస్కామ్ చైర్మన్ ఆర్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీల ఆసక్తీ వ్యక్తమవుతోందన్నారు.
 
 గ్రామీణ ప్రాంతాలకు ఐటీ సేవలను అందించడానికి సహాయం చేయాల్సిందిగా నాస్కామ్ ప్రతినిధులను కోరినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు తెలిపారు. నాస్కామ్ ప్రతినిధులను కలిసిన అనంతరం కలిసిన విలేకరులతో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గ్రామీణ యువతకు ఉపాధి కల్పించే విధంగా ఐటీని ప్రోత్సహించడం,  గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇంటర్నెట్ కనెక్షన్స్ ఏ విధంగా అందుబాటులోకి తీసుకురావాలన్న అంశాలపై చర్చించినట్లు తెలిపారు.

రాజధాని కూడా లేని రాష్ట్రం కాబట్టి కొన్ని ఇబ్బందులున్నా అన్ని వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చానని తెలిపారు. ఇప్పటికే టెక్ మహీంద్రా, విప్రో వంటి కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయని, మరిన్ని కంపెనీలు ఏపీకి క్యూ కట్టే రోజులు త్వరలోనే ఉన్నాయన్నారు. ప్రారంభ కంపెనీలను ప్రోత్సహించడం కోసం నాస్కామ్ భాగస్వామ్యంతో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఇంకుబేషన్ సెంటర్‌ను సెప్టెంబర్ 29న ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి ప్రచారం చేస్తున్న డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అవకాశాలను అందిపుచ్చుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాస్కామ్ చైర్మన్ ఆర్.చంద్రశేఖరన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు కంపెనీల ఆసక్తీ వ్యక్తమవుతోందన్నారు.
 
 మొదటి స్థానంపై హైదరాబాద్ దృష్టి: కేటీఆర్
 ఐటీ ఎగుమతుల్లో మొదటి స్థానం కోసం హైదరాబాద్ పోటీ పడుతోందని, ఇందుకు అడ్డంకిగా ఉన్న  అవాంతరాలను తొలగించడమే కాకుండా కావల్సిన సౌకర్యాలను కల్పిస్తామని తెలంగాణ ఐటీ మంత్రి కెటీఆర్ తెలిపారు. నాస్కామ్ ప్రతినిధులతో సమావేశం అనంతరం మంత్రి మాట్లాడుతూ  ప్రస్తుతం ఐటీ ఎగుమతుల్లో 31 శాతం వాటాతో బెంగళూరు మొదటి స్థానంలో ఉంటే 12 శాతం వాటాతో హైదరాబాద్ రెండో స్థానంలో ఉందన్నారు. గత నాలుగైదేళ్లుగా ఉన్న స్తబ్ధతతొలిగిపోయిందని, అన్ని ఐటీ కంపెనీలు విస్తరణ కార్యక్రమాలను చేపట్టారన్నారు.

మహిళా ఉద్యోగుల భద్రత విషయాన్ని నాస్కామ్ ప్రతినిధులు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకొచ్చిన వెంటనే స్పందించడమే కాకుండా ఐటీ కారిడార్‌లో 10 రోజుల్లో ప్రత్యేక మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినట్లు మంత్రి తెలిపారు. వరంగల్, కరీంనగర్ వంటి చిన్న పట్టణాలకు విస్తరించడానికి కొన్ని సం స్థలు ముందుకొచ్చాయని, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించనున్నట్లు రామారావు తెలిపారు.

ప్రపంచ మేయర్ల సమావేశం నాటికి హైదరాబాద్‌లో కొన్ని ప్రాంతాల్లో వైఫై, 4జీ సేవలను అందించడానికి రిలయన్స్ ముందుకొచ్చిందని, తొందరలోనే అన్ని కంపెనీ లు వైఫై అందించే విధంగా ఒక విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఐటీ పాలసీ ప్రకటించిన తర్వాత నాస్కామ్‌తో కలిసి ఒక వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నట్లు తెలిపారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement