భారత్‌లో ‘నెట్‌ఫ్లిక్స్’ సర్వీసులు ప్రారంభం...
నెలవారీ ప్యాకేజీ ధర రూ. 500 -రూ. 800
న్యూఢిల్లీ: సినిమాలు, సీరియల్స్ స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో తన సర్వీసులను ప్రారంభించింది. నెలవారీ రూ. 500 నుంచి రూ. 800 దాకా అన్‌లిమిటెడ్ కంటెంట్ ప్యాకేజీలు ఉంటాయని సంస్థ తెలిపింది. లాస్ వెగాస్‌లో కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2016లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ సీఈవో రీడ్ హేస్టింగ్స్.. నెట్‌ఫ్లిక్స్ భారత్ సహా 130 దేశాలకు కార్యకలాపాల విస్తరణను ప్రకటించారు.
భారత్‌లో ప్రధానంగా మూడు రకాల నెలవారీ ప్యాకేజీలను నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది. బేసిక్ (రూ.500), స్టాండర్డ్ (రూ. 650), ప్రీమియం (రూ.800) వీటిలో ఉన్నాయి. యూజర్లకు నెల రోజుల పాటు ఉచితంగా ట్రయల్ ఆఫర్ కూడా కంపెనీ అందిస్తోంది. భారత్‌లో హంగామా, హుక్, హాట్‌స్టార్, స్పూల్ వంటి ప్రత్యర్థి సంస్థల సేవలతో నెట్‌ఫ్లిక్స్ పోటీపడనుంది. మార్వెల్‌కి చెందిన డేర్‌డెవిల్, జెస్సికా జోన్స్, ఆర్కోస్, సెన్స్8, గ్రేస్ అండ్ ఫ్రాంకీ, మార్కో పోలో వంటి సిరీస్‌లతో పాటు పలు టీవీ షోలు, సినిమాలు నెట్‌ఫ్లిక్స్ రాకతో భారత్ యూజర్లకు అందుబాటులోకి వస్తాయి.