
సాక్షి, న్యూఢిల్లీ : ఇంటర్నెట్ ఆధారంగా నడుస్తున్న ఆన్‌లైన్ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకు ఊపందుకుంటోంది. వీడియోలు, వీడియో గేమ్‌లు, ఈ స్పోర్ట్స్, మ్యూజిక్ వల్ల వార్షాదాయం గణనీయంగా పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఆన్‌లైన్ ఆర్థిక వ్యవస్థ 4,464 కోట్ల రూపాయలుకాగా ఇది 2023 నాటికి దాదాపు మూడింతలు పెరిగి 11,976 కోట్ల రూపాయలకు చేరుకుంటుందని ‘ప్రైస్‌వాటర్‌హౌస్ కూపర్స్’ కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది.
ఇప్పటికీ వినోద కార్యక్రమాలను ఎక్కువగా టీవీల్లోనే చూస్తున్నారు. టీవీలు, పత్రికలకే ఇప్పటికీ ఎక్కువగా వాణజ్య ప్రకటనలు వెళుతున్నాయి. అయినప్పటికీ స్మార్ట్‌ఫోన్ల పుణ్యమా అని ఆన్‌లైన్ ఆర్థిక వ్యవస్థ బలపడుతోంది. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్, జియోటీవీ, ఆల్ట్ బాలాజీలకు స్మార్ట్‌ఫోన్ల వల్ల ఆదరణ పెరుగుతోంది. ప్రపంచంలోని అగ్ర రాజ్యాలకన్నా ఆన్‌లైన్ ఆర్థిక వ్యవస్థ భారత్‌లోనే వేగంగా విస్తరిస్తోందని కన్సల్టెన్సీ సంస్థ తెలిపింది. వీడియో గేమ్స్, ఈ స్పోర్ట్స్, ఇంటర్నెట్ అడ్వర్టయిజ్‌మెంట్, ఇంటర్నెట్ యాక్సెస్, మ్యూజిక్, రేడియో, పాడ్‌కాస్ట్స్, ఆన్‌లైన్ టీవీ, హోం వీడియో, సినిమా తదితర రంగాల ద్వారా ఆన్‌లైన్ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment