బీఎండబ్ల్యూ ఎక్స్‌ 3 లాంచ్‌..ధర, ఫీచర్లు | New BMW X3 India Launch | Sakshi
Sakshi News home page

బీఎండబ్ల్యూ ఎక్స్‌ 3 లాంచ్‌..ధర, ఫీచర్లు

Published Thu, Apr 19 2018 1:20 PM | Last Updated on Thu, Apr 19 2018 4:05 PM

New BMW X3 India Launch - Sakshi


సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల  కంపెనీ  బీఎండబ్ల్యూ కొత్త తరం కార్‌ను  ఢిల్లీలో లాంచ్‌ చేసింది.  బీఎండ్లబ్యు ఎక్స్‌ 3 పేరుతో  థర్డ్‌ జనరేషన్‌   కార్లను భారత మార్కెట్లో లాంచ్‌  చేసింది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో   2018 ఆటో ఎక్స్‌పోలో వీటిని పరిచయం చేయగా జూన్‌లో గ్లోబల్‌గా అందుబాటులోకి తెచ్చింది.  ఈ కార్ల ధరలు ప్రారంభ ధర సుమారు 50 లక్షల రూపాయలుగా ఉంది.  బీఎండబ్ల్యూ ఎక్స్‌ 3 20డి ఎక్స్‌పిడిషన్‌ ధర రూ .49.90( ఎక్స్‌షో రూం ధర) , లగ‍్జరీ వెర్షన్‌  బీఎండబ్ల్యూ ఎక్స్‌ 3 .20డి లగ్జరీ లైన్  ధర రూ.56.70లక్షలుగా  ఉంది. నేటి(గురువారం) నుంచే ఇవి అమ్మకానికి అందుబాటులో ఉన్నాయని కంపెనీ ప్రకటించింది. ఈ కొత్త లాంచింగ్‌ ద్వారా భారత మార్కెట్‌లో తమ అమ్మకాలను మరింత పెంచుకుంటామన్న విశ్వాసాన్ని  బీఎండబ్ల్యూ  ప్రెసిడెంట్‌  విక్రమ్‌ సావా  వ్యక్తం చేశారు. త్వరలోనే పెట్రోల్‌ వెర్షన్‌నుకూడా  అందిస్తామని తెలిపారు .


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement