హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ చైర్మన్‌గా భాగ్యనగర్ ఇండియా ఎండీ దేవేంద్ర సురానా నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఆయన ఫిక్కీ తెలంగాణ, ఏపీ కౌన్సిల్ కో-చైర్‌గా వ్యవహరించారు. ఫిక్కీ ఆంధ్రప్రదేశ్ చైర్మన్‌గా ఎన్‌ఎస్‌ఎల్ గ్రూప్ సీఎండీ ఎం.ప్రభాకర్‌రావు ఎంపికయ్యారు. ఫిక్కీ అగ్రికల్చర్ కమిటీకి ఆయన చైర్మన్‌గానూ పనిచేశారు. ఇప్పటి వరకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు ఫిక్కీలో ఒకే కౌన్సిల్ కింద ఉండేవి.
2010 నుంచి ఈ కౌన్సిల్‌కు చైర్‌పర్సన్‌గా అపోలో హాస్పిటల్స్ జేఎండీ సంగీత రెడ్డి కొనసాగారు. ప్రాంతాలవారీగా దృష్టిసారించడంతోపాటు మరింత మెరుగ్గా పనిచేసేందుకే కౌన్సిల్‌ను రెండుగా చేసినట్టు ఈ సందర్భంగా సంగీత రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ, ఏపీకి ఫిక్కీ కొత్త సారథులు
Published Mon, Jul 4 2016 1:28 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
Advertisement
Advertisement