న్యూఢిల్లీ: ఇటాలియన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మాసెరాటీ తాజాగా భారత మార్కెట్లోకి క్వాట్రోపోర్ట్ లేటెస్ట్ ఎడిషన్ కారును ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 1.74 కోట్ల నుంచి ప్రారంభమవుతుంది (ఎక్స్‌షోరూం రేటు). 2019 క్వాట్రోపోర్ట్ గ్రాన్‌లుసో వెర్షన్ రేటు రూ. 1.74 కోట్లు కాగా, గ్రాన్స్‌పోర్ట్ వెర్షన్ ధర రూ. 1.79 కోట్లుగా ఉంటుందని సంస్థ తెలిపింది. వినూత్నమైన రంగులు, వీల్ డిజైన్స్, ఇంటీరియర్స్‌తో 2019 ఎడిషన్ కార్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment