
భారత్‌లో అతిపెద్ద బ్యాంకు కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ ఫ్లాగ్‌షిప్ కంపెనీ ఫైర్‌స్టార్ డైమాండ్ ఇంక్ దివాలా తీయబోతుంది. ఫైర్‌స్టార్ డైమాండ్ అమెరికాలో దివాలా కోసం పిటిషన్‌ను దాఖలు చేసింది. కంపెనీకి లిస్టెడ్ ఆస్తులు, అప్పులు 50 మిలియన్ డాలర్ల నుంచి 100 మిలియన్ డాలర్ల రేంజ్‌లో ఉన్నాయని న్యూయార్క్‌లో దక్షిణ జిల్లాలో కోర్టు ఫైలింగ్‌లో తెలిపింది.
కాగ, పంజాబ్ నేషనల్ బ్యాంకులో చోటుచేసుకున్న రూ.12,636 కోట్ల కుంభకోణంలో ఈ ఫైర్‌స్టార్ డైమాండ్‌కు చెందిన నీరవ్ మోదీనే ప్రధాన పాత్రదారుడిగా ఉన్నారు. తొలుత ఈ కుంభకోణం రూ.11,400 కోట్లని లెక్కించగా.. అనంతరం ఈ అక్రమ లావాదేవీలు మరింత పెరిగినట్టు పీఎన్‌బీ వెల్లడించింది. ఈ కుంభకోణంలో నీరవ్ మోదీతో పాటు ఆయన అంకుల్ మెహుల్ చౌక్సి, కుటుంబసభ్యులు, బ్యాంకు అధికారులు కూడా ఉన్నారు.
ఫైర్‌స్టార్ డైమాండ్‌కు మోదీ వ్యవస్థాపకుడు కాగ, మెహుల్ చౌక్సి గీతాంజలి జెమ్స్ లిమిటెడ్‌కు అధిపతి. ఇద్దరు ఉద్యోగులను ఉపయోగించుకుని వీరు పీఎన్‌బీలో ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. భారత్‌లో వీరి కంపెనీలపై భారీ ఎత్తున్న దాడులు జరిగాయి. గీతాంజలి జెమ్స్ స్టోర్లు కొన్నింటిన్నీ సీజ్ కూడా చేశారు. వీరిపై దర్యాప్తును ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు మమ్మురం చేశాయి. నీరవ్, చౌక్సిలను తిరిగి ఇండియా రప్పించడానికీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుంభకోణానికి పాల్పడిన అనంతరం నీరవ్, చౌక్సిలు విదేశాలకు చెక్కేశారు.
Comments
Please login to add a commentAdd a comment