చిన్న పిల్లలకు ఎయిర్‌కోస్టాలో ఉచితం | no charges to childrens in air costa | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లలకు ఎయిర్‌కోస్టాలో ఉచితం

Published Thu, Nov 13 2014 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 4:20 PM

చిన్న పిల్లలకు ఎయిర్‌కోస్టాలో ఉచితం

చిన్న పిల్లలకు ఎయిర్‌కోస్టాలో ఉచితం

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బాలల దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎయిర్‌కోస్టా చిన్న పిల్లలకు ఉచిత విమాన ప్రయాణ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సాధారణంగా 6 నెలల నుంచి 2 ఏళ్లలోపు పిల్లలకు రూ.1,000 చార్జీలను వసూలు చేస్తారని, కానీ ఈ ఆఫర్ సమయంలో ఉచితంగా ప్రయాణించొచ్చని ఎయిర్‌కోస్టా ఒక ప్రకటనలో పేర్కొంది.

2-12 ఏళ్లలోపు పిల్లలకు చార్జీలో 50% తగ్గింపును అందిస్తోంది. నవంబర్ 13 నుంచి 15లోపు బుక్ చేసుకున్న టికెట్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఈ టికెట్లతో నవంబర్ 13 నుంచి ఏప్రిల్ 15, 2015లోపు ఎప్పుడైనా ప్రయాణం చేయొచ్చు. నవంబర్ 14న ఎయిర్‌కోస్టాలో ప్రయా ణిస్తున్న పిల్లలందరికీ గిఫ్ట్‌లను అందించనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement