స్కువ సర్వీసెస్లో క్రెడిట్సేఫ్ పెట్టుబడులు | Norway firm Creditsafe picks 75% in Skua Services | Sakshi
Sakshi News home page

స్కువ సర్వీసెస్లో క్రెడిట్సేఫ్ పెట్టుబడులు

Published Fri, Jul 1 2016 1:01 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM

స్కువ సర్వీసెస్లో క్రెడిట్సేఫ్ పెట్టుబడులు - Sakshi

స్కువ సర్వీసెస్లో క్రెడిట్సేఫ్ పెట్టుబడులు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బిజినెస్ ఇంటెలిజెన్స్ రంగంలో ఉన్న నార్వే సంస్థ క్రెడిట్‌సేఫ్... హైదరాబాద్‌కు చెందిన స్కువ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టింది. అయితే ఎంత మొత్తం పెట్టుబడి పెట్టిందనేది కంపెనీ వెల్లడించలేదు. క్రెడిట్‌సేఫ్‌కు ఐటీ డెవలప్‌మెంట్ సేవలందిస్తామని స్కువ సర్వీసెస్ ఫౌండర్ కిషోర్ కంచర్ల గురువారమిక్కడ విలేకరులతో చెప్పారు. ఈ కంపెనీలో తమకు 75% వాటా ఉందని క్రెడిట్‌సేఫ్ చీఫ్ టెక్నాలజీ, కంటెంట్ ఆఫీసర్ ఆంగస్ గోవ్ తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా 90 వేలకుపైగా కంపెనీలకు సేవలందిస్తున్నట్టు వెల్లడించారు. 2015లో వివిధ కంపెనీలకు చెందిన 10 కోట్లకుపైగా క్రెడిట్ రిపోర్టులను క్లయింట్లకు సరఫరా చేశామని చెప్పారాయన. కంపెనీల వ్యాపారం తీరుతెన్నులు, డెరైక్టర్లు, పెట్టుబడులు, ఆస్తులు, అప్పులు తదితర అంశాలను క్రెడిట్‌సేఫ్ సేకరించి నిక్షిప్తం చేస్తుంది. ఈ సమాచారాన్ని కోరిన క్లయింట్లకు అందిస్తుంది. ప్రస్తుతం భారత్‌లో ఈ సమాచారాన్ని కంపెనీ సేకరిస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించనున్నట్టు వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement