సత్య నాదెళ్లకు ఒబామా సత్కారం
త్వరలో ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ అవార్డు ప్రదానం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ అవార్డుతో సత్కరించనున్నారు. కంపెనీలో మార్పు తీసుకురావడం, ఉద్యోగులకు ఉపయుక్తమైన పలు చర్యలను చేపట్టడం, ఉద్యోగులందరికీ సమాన వేతన చెల్లింపు, ఉద్యోగుల మధ్య వివక్ష లేకుండా అందరికీ సమాన గుర్తింపు ఇవ్వటం వంటి తదితర అంశాలకు కృషిచేసిన వారికి ‘చాంపియన్ ఆఫ్ చేంజ్’ అవార్డును ప్రదానం చేస్తారు.
1992లో మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగంలో చేరిన సత్య నాదెళ్ల గతేడాది కంపెనీ సీఈఓ స్థాయికి ఎదిగారు. ఆయన మంగళూరు యూనివ ర్సిటీలో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో బ్యాచ్‌లర్ డిగ్రీని, విస్కాన్‌సిన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్ డిగ్రీని, షికాగో యూనివర్సిటీలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్ డిగ్రీని పూర్తిచేశారు.