
డీజీహెచ్ బాధ్యతల్ని విస్మరించింది..
న్యూఢిల్లీ: గ్యాస్ వివాదంలో డెరైక్టరేట్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్ (డీజీహెచ్) తన బాధ్యతలను సరిగా నిర్వహించలేదని ఓఎన్‌జీసీ విమర్శించింది. తమ బ్లాక్ నుంచి రిలయన్స్ బ్లాక్‌లోకి గ్యాస్ తరలివెళ్లడానికి డీజీహెచ్ కూడా ఒక కారణమని పేర్కొంది.రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్‌ఐఎల్) వద్ద ఉన్న సమాచారం గురించి డీజీహెచ్‌కు పూర్తి అవగాహన ఉందని, అలాంటప్పుడు అది తమ ఫిర్యాదు కోసం వేచి చూడకుండా చ ర్యలు తీసుకొని ఉండాల్సిందని ఏ పీ షా కమిటీకి అందించిన నివేదికలో ఓఎన్‌జీసీ పేర్కొంది. 2004లో డీ1, డీ3 విస్తరణకు సంబంధించి ఆర్‌ఐఎల్ తన ఇనీషియల్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఐడీపీ)ను సమర్పించినప్పుడే డీజీహెచ్ గ్యాస్ క్షేత్రాల అనుసంధాన విషయాన్ని గమనించి ఉండాల్సిందని అభిప్రాయపడింది. కాగా ఓఎన్‌జీసీ తన బ్లాక్ నుంచి ఆరేళ్లపాటు ఆర్‌ఐఎల్ బ్లాక్‌కు తరలివెళ్లిన దాదాపు 1.4 బిలియన్ డాలర్ల విలుైవె న గ్యాస్‌కు 18 శాతం వడ్డీతో సహా పరిహారం డిమాండ్ చేస్తోంది.