న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆధార్‌తో పాన్ అనుసంధాన గడువును మరోసారి పొడిగించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు రెండింటిని అనుసంధానం చేసుకోవచ్చని తెలిపింది. అధార్–పాన్ అనుసంధాన గడువు పొడిగించడం ఇది మూడోసారి. కాగా మూమూలుగా ఆధార్–పాన్ అనుసంధానానికి చివరి తేదీ జూలై 31.
కేంద్రం ఈ తేదీని తర్వాత ఆగస్ట్ 31 వరకు, అటుపై మళ్లీ డిసెంబర్ 31 వరకు, ఇప్పుడు తాజాగా మార్చి 31 వరకు పొడిగించింది. కొందరు పన్ను చెల్లింపుదారులు వారి పాన్ నంబర్‌ను ఇప్పటికీ ఆధార్‌తో అనుసంధానం చేసుకోలేదనే అంశం తమ దృష్టికి వచ్చిందని, అందుకే తాజాగా గడువును పొడిగిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. నవంబర్ నాటికి 33 కోట్ల పాన్ నంబర్లకు గానూ 13.28 కోట్లే ఆధార్‌తో అనుసంధానమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment