ముంబై: దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంత డిమాండ్ ఉందో మనందరికి తెలిసిందే. కానీ సాఫ్ట్‌వేర్ పరిశ్రమ, ప్రైవేట్ రంగాలలో ఇటీవల కాలంలో కంపెనీలు అత్యధిక వేతనాలు ఆఫర్ చేస్తుండడంతో విద్యార్థులు ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేటు రంగానికి సమ ప్రాధాన్యత ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో కంపెనీలు నియామకాల ప్రక్రియను చేపట్టడం లేదు. ఈ నేపథ్యంలో విద్యార్థుల అభిప్రాయాలు తెలుసుకునేందుకు 6,500మంది ప్రజలతో అడ్డా 247అనే సంస్థ సర్వే నిర్వహించింది.
అడ్డా 247 సంస్థ జేఈఈ, నీట్ తదితర ప్రవేశ పరీక్షలకు, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రపేరయ్యే వారికి తమ పోర్టల్ ద్వారా అత్యుత్తమ ఫ్యాకల్టీతో మెరుగైన శిక్షణ అందిస్తుంది. అయితే సర్వేలో మెజారిటీ ప్రజలు ఉద్యోగ బధ్రతకే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కాగా ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేసే వారు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సర్వేలో పాల్గొన్న కొందరు విద్యార్థులు చెప్పినట్లు అడ్డా 247సీఈఓ అనిల్ నగర్ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment