కీలక వడ్డీ రేట్ల తగ్గింపు | RBI cuts repo rate | Sakshi
Sakshi News home page

కీలక వడ్డీ రేట్ల తగ్గింపు

Published Tue, Apr 5 2016 11:07 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

కీలక వడ్డీ రేట్ల తగ్గింపు

కీలక వడ్డీ రేట్ల తగ్గింపు

ముంబై: అంచనాలకనుగుణంగానే ప్రస్తుతం ఉన్న రెపో, రివర్స్ రెపో  రేట్లను తగ్గిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.  మంగళవారం  మొదటి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష జరిపిన ఆర్బీఐ ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది.  ప్రస్తుతం ఉన్న కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ప్రకటించారు.  ఈ తాజా ప్రకటనతో  రేపోరేటు  25  బేసిస్ పాయింట్లను తగ్గించింది.   రేపోరేటు 6.75 శాతం నుంచి 6.50 పాయింట్లకు తగ్గించింది. రివర్స్ రెపోను  పావు శాతం పెంచింది.  నగదు నిల్వల నిష్పత్తి(సీఆర్‌ఆర్-బ్యాంకులు తమ డిపాజిట్ నిధుల్లో ఆర్‌బీఐ వద్ద కచ్చితంగా ఉంచాల్సిన నిధులు) 4 శాతాన్ని యథాతథంగా ఉంచింది. రెపోరేటు 0.25 శాతం కోతతో గృహ, వాహన రుణాలు మరోసారి తగ్గడానికి మార్గం సుగమమైంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement