
న్యూఢిల్లీ: చైనాకు చెందిన మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘రియల్‌మి’.. దేశీ మార్కెట్లో మంగళవారం రెండు అధునాతన స్మోర్ట్‌ఫోన్లను విడుదలచేసింది. ‘రియల్‌మి 5’ పేరుతో విడుదలైన ఫోన్ ధర రూ.9,999 కాగా.. మొత్తం మూడు వేరియంట్లలో ఇది విడుదలైంది. ఆగస్టు 27 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.5 అంగుళాల డిస్‌ప్లే, ముందువైపు 13 మెగాపిక్సెల్ కెమెరా.. వెనుకవైపు 119 డిగ్రీ 8మెగాపిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా, 12ఎంపీ మెయిన్ కెమెరా లెన్స్, 2ఎంపీ ఆల్ట్రా మాక్రో లెన్స్, 2 ఎంపీ పోట్రెయిట్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. ‘రియల్‌మి 5 పో’ సెప్టెంబరు 4 నుంచి అందుబాటులోకి రానుంది. ఇందులో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 48ఎంపీ మెయిన్ కెమెరా లెన్స్ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment