
ఆర్‌కామ్‌లో వేతనం వద్దనుకున్న అనిల్ అంబానీ
న్యూఢిల్లీ: పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) అధినేతగా ఉన్న అనిల్ అంబానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ నుంచి ఏ విధమైన వేతనం గానీ, కమిషన్ గానీ తీసుకోరాదని నిర్ణయించుకున్నారు. అలాగే కంపెనీలోని టాప్ మేనేజ్‌మెంట్ సైతం తమ వ్యక్తిగత చెల్లింపులను 21 రోజలు పాటు ఈ ఆర్థిక సంవత్సరం చివరి వరకూ వాయిదా వేసుకుంటూ వెళ్లాలని నిర్ణయం తీసుకుంది.
‘‘రిలయన్స్ అనిల్ దీరూభాయి అంబానీ గ్రూపు చైర్మన్ అయిన అనిల్ అంబానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వేతనం, కమిషన్ తీసుకోరాదని స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నట్టు ఆర్‌కామ్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు రూ.45,000 కోట్ల మేర ఆర్‌కామ్ బకాయిలు పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేటింగ్ సంస్థలు ఆర్‌కామ్ పరపతి రేటింగ్‌ను తగ్గించాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ నాటికి రూ.25,000 కోట్ల బకాయిలు తీర్చేస్తామని అనిల్ అంబానీ ఆయా సంస్థలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.