
హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 75,000–80,000 మంది దాకా సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్లు టెలికం దిగ్గజం రిలయన్స్ జియో చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ సంజయ్ జోగ్ తెలిపారు. ప్రస్తుతం కంపెనీలో 1,57,000 మంది సిబ్బంది ఉన్నారని సొసైటీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు.
ఉద్యోగుల వలసల విషయానికొస్తే .. సేల్స్ తదితర విభాగాల్లో 32%గా ఉందని, సగటున చూస్తే మాత్రం 18% మేర ఉందని సంజయ్ చెప్పారు. దేశవ్యాప్తంగా 6,000 కాలేజీలతో రిలయన్స్ జియో జట్టుకట్టినట్లు ఆయన తెలిపారు. 60–70 శాతం నియామకాలు కాలేజీలు, ఉద్యోగుల నుంచి వచ్చే రిఫరల్స్ ద్వారానే ఉంటున్నాయని సంజయ్ వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment