అద్దె ఇళ్ల కష్టాలిక చెల్లు | Rental Housing Difficulties is no more nestway.com ceo amarendra sahu | Sakshi
Sakshi News home page

అద్దె ఇళ్ల కష్టాలిక చెల్లు

Published Thu, Apr 7 2016 6:10 AM | Last Updated on Sun, Sep 3 2017 9:20 PM

అద్దె ఇళ్ల కష్టాలిక చెల్లు

అద్దె ఇళ్ల కష్టాలిక చెల్లు

యజమానులకు అదనపు ఆదాయం
నెస్ట్‌అవే సీఈవో అమరేంద్ర సాహు

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అద్దె ఇల్లు అవసరం అయిన వారికి, ఇంటి యజమానులకు ఇబ్బందులు లేని సేవలు అందిస్తామంటోంది బెంగళూరుకు చెందిన నెస్ట్ అవే. కిరాయిదారులకు, యజమానులకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న నెస్ట్‌అవే.కామ్ హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణే నగరాల్లో 2,400 మంది ఇంటి యజమానులకు 10 వేలకుపైగా కిరాయిదారులను అనుసంధానించింది. కిరాయిదారులు అద్దె చెల్లించకపోయినా, ఇంటికి నష్టం వాటిల్లినా ఆ బాధ్యత తమదేనని చెప్పారు నెస్ట్ అవే సహ వ్యవస్థాపకులు, సీఈవో అమరేంద్ర సాహు. అద్దె రూ.6 వేల నుంచి మొదలవుతుందని, రెండు నెలల అడ్వాన్సు చెల్లిస్తే చాలని బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు.

 ఎలా పనిచేస్తుందంటే..
అద్దెకు ఇల్లు, రూమ్, బెడ్ కావాల్సిన వారు వెబ్‌సైట్లో పేరు నమోదు చేసుకోవాలి. ఈ-మెయిల్ ఐడీ, గుర్తింపు కార్డులు, ఫోన్ నంబరు ఇవ్వాలి. కంపెనీ ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ టెక్నాలజీతో ఇవి సరైనవా కాదా అని పరిశీలిస్తుంది. ఇంట్లో చేరే ముందు కూడా ఈ పత్రాలను పరిశీలిస్తారు. ఇక అందుబాటులో ఉన్న ఇళ్ల వివరాలు వెబ్‌సైట్లో చూడవచ్చు. ప్రత్యక్షంగా చూడాలంటే అపాయింట్‌మెంట్ కోరవచ్చు. నేరుగా బుక్ చేసుకుంటే కొంత మొత్తాన్ని ఆన్‌లైన్‌లో అడ్వాన్సుగా చెల్లించాలి. మిగిలినది ఇంట్లో చేరే ముందు చెల్లించాలి. ఇల్లు నచ్చకపోతే మూడు రోజుల్లో డబ్బులు వెనక్కి ఇస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement