గత సంచికలో వేతనజీవుల రిటర్నుల విషయంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అదే విధంగా ఈ రోజు వ్యాపారస్తుల రిటర్నులకు సంబంధించిన కీలక అంశాల గురించి తెలుసుకుందాం. వ్యాపారస్తులకు వర్తించే ప్రధానమైన ఫారాలు రెండు ఉంటాయి. అవి ఐటీఆర్ 3, ఐటీఆర్4.
ఐటీఆర్ 3..
♦ వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబం ఈ ఫారం వేయవచ్చు.
♦ వ్యాపారం మీద ఆదాయంతో పాటు ఇతర ఆదాయాలు అంటే జీతం, ఇంటద్దె, మూలధన లాభాలు మొదలైనవి ఉన్నవారు కూడా దీన్ని వేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ఆదాయాలు ఉన్నవారు ఈ ఫారంలోనే ఆదాయాన్ని డిక్లేర్ చేయాలి.
♦ ఈ–ఫైలింగ్ కంపల్సరీ. మినహాయింపు లేదు.
♦ డిజిటల్ సంతకం తప్పనిసరి కాదు.
♦ కొంత మందికి ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండి.. వాటి మీద ఆదాయం అందుకుంటూ ఉండవచ్చు. దీనితో పాటు వ్యాపారం మీద ఆదాయం ఉన్నట్లయితే.. ఈ ఫారం వాడాలి.
♦ ఇంటి మీద ఆదాయంలో నష్టం వచ్చినవాళ్లు, అలాంటి నష్టాన్ని సర్దుబాటు కాకుండా తర్వాత సంవత్సరాలకు బదిలీ చేసుకోవాల్సిన వాళ్లు (క్యారీ ఫార్వర్డ్) ఈ ఫారం ద్వారా రిటర్నులు వేయాలి.
♦ వ్యవసాయ ఆదాయం రూ. 5,000 దాటినవాళ్లు కూడా దీన్ని ఉపయోగించాలి.
♦ అలాగే మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటినవాళ్లు కూడా ఈ ఫారం ద్వారా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది.
♦ లాటరీలో గెలిచిన వారు, గుర్రపు పందేలలో లాభం వచ్చిన వారు.. అలాగే ఇతర ఆదాయంలో ‘నష్టం’ వచ్చిన వారు దీన్ని వేయొచ్చు.
♦ మూలధన లాభాలు లేదా నష్టాలు వచ్చిన వారు వేయొచ్చు.
♦ భాగస్వామ్యంలో వడ్డీ, జీతం, లాభంలో వాటాలు ఉన్న వారు ఫారం 3ని ఉపయోగించాలి.
♦ విదేశాల నుంచి ఆదాయం, ఆస్తులు, ఇతరత్రాలు ఉన్నవాళ్లు వేయొచ్చు.
♦ స్వంతంగా ఆదాయం డిక్లేర్ చేద్దామనుకున్న వాళ్లూ వేయొచ్చు.
♦ నష్టాలను రాబోయే సంవత్సరంలో సర్దుబాటు చేసుకోవాలనుకునే వారూ వేయొచ్చు.
ఐటీఆర్ 4 ఫారం..
♦ వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబం ఈ ఫారం వేయొచ్చు.
♦ వ్యాపారంలో లెక్కలతో నిమిత్తం లేకుండా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కొంత శాతాన్ని లాభంగా డిక్లేర్ చేసే విధానాన్ని ‘ఊహాజనిత ఆధారం’గా వ్యవహరిస్తారు. దీనికి కూడా ఈ ఫారంను ఉపయోగించవచ్చు.
♦ ఈ–ఫైలింగ్ తప్పనిసరి.
♦ 80 యేళ్లు దాటినవారికి, రూ. 5 లక్షల లోపు ఆదాయం గలవారికి మాత్రం తప్పనిసరి కాదు.
♦ ‘ఊహాజనిత ఆధారం’గా లెక్కించిన ఆదా యంతో పాటు జీతం, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉన్నవారు దీన్ని వేయొచ్చు.
♦ ఆదాయం రూ. 50,00,000 దాటినవారు ఈ ఫారం వేయొచ్చు.
♦ ఈ ఫారం వేసేవాళ్లు బుక్స్ రాయనక్కర్లేదు.
♦ టర్నోవరు రూ. 2 కోట్లు దాటిన వాళ్లు ఈ ఫారం ద్వారా రిటర్నులు వేయరాదు.
♦ 44 అఈ, 44 అఉ ప్రకారం ఈ పన్నులను లెక్కించవచ్చు.
♦ 44 అఈ ప్రకారం ఆదాయాన్ని టర్నోవరులో 8 శాతం కన్నా ఎక్కువ డిక్లేర్ చేయొచ్చు.
♦ 44 అఉ ప్రకారం రవాణా చేసే వాహనాలకైతే.. బండికి ఇంత ఆదాయమని నిర్దేశించారు. నెలకి ఒక్కో బండికి రూ.7,500కన్నా ఎక్కువ డిక్లేర్ చేసుకోవచ్చు.
చివరగా.. ఈ–వెరిఫికేషన్ గతంలో చెప్పిన విధంగా చేయొచ్చు. ఏదేని కారణం వలన ఈ–వెరిఫై చేయకపోతే అక్నాలెడ్జ్‌మెంట్‌ని బెంగళూరు పంపవలసి ఉంటుంది.
వ్యాపారస్తులకు రిటర్ను ఫారంలు..
Published Mon, Jul 16 2018 1:07 AM | Last Updated on Mon, Jul 16 2018 1:07 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment