forms
-
ప్రపంచంలోని టాప్ 10 నృత్యాలు
-
భారతదేశంలోని టాప్ 10 శాస్త్రీయ నృత్యాలు
-
ఆకట్టుకుంటున్న ‘ఘన’ గణనాథుడి రూపాలు (ఫొటోలు)
-
వ్యాపారస్తులకు రిటర్ను ఫారంలు..
గత సంచికలో వేతనజీవుల రిటర్నుల విషయంలో ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. అదే విధంగా ఈ రోజు వ్యాపారస్తుల రిటర్నులకు సంబంధించిన కీలక అంశాల గురించి తెలుసుకుందాం. వ్యాపారస్తులకు వర్తించే ప్రధానమైన ఫారాలు రెండు ఉంటాయి. అవి ఐటీఆర్ 3, ఐటీఆర్4. ఐటీఆర్ 3.. ♦ వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబం ఈ ఫారం వేయవచ్చు. ♦ వ్యాపారం మీద ఆదాయంతో పాటు ఇతర ఆదాయాలు అంటే జీతం, ఇంటద్దె, మూలధన లాభాలు మొదలైనవి ఉన్నవారు కూడా దీన్ని వేయొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్ని ఆదాయాలు ఉన్నవారు ఈ ఫారంలోనే ఆదాయాన్ని డిక్లేర్ చేయాలి. ♦ ఈ–ఫైలింగ్ కంపల్సరీ. మినహాయింపు లేదు. ♦ డిజిటల్ సంతకం తప్పనిసరి కాదు. ♦ కొంత మందికి ఒకటి కంటే ఎక్కువ ఇళ్లు ఉండి.. వాటి మీద ఆదాయం అందుకుంటూ ఉండవచ్చు. దీనితో పాటు వ్యాపారం మీద ఆదాయం ఉన్నట్లయితే.. ఈ ఫారం వాడాలి. ♦ ఇంటి మీద ఆదాయంలో నష్టం వచ్చినవాళ్లు, అలాంటి నష్టాన్ని సర్దుబాటు కాకుండా తర్వాత సంవత్సరాలకు బదిలీ చేసుకోవాల్సిన వాళ్లు (క్యారీ ఫార్వర్డ్) ఈ ఫారం ద్వారా రిటర్నులు వేయాలి. ♦ వ్యవసాయ ఆదాయం రూ. 5,000 దాటినవాళ్లు కూడా దీన్ని ఉపయోగించాలి. ♦ అలాగే మొత్తం ఆదాయం రూ. 50,00,000 దాటినవాళ్లు కూడా ఈ ఫారం ద్వారా రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ♦ లాటరీలో గెలిచిన వారు, గుర్రపు పందేలలో లాభం వచ్చిన వారు.. అలాగే ఇతర ఆదాయంలో ‘నష్టం’ వచ్చిన వారు దీన్ని వేయొచ్చు. ♦ మూలధన లాభాలు లేదా నష్టాలు వచ్చిన వారు వేయొచ్చు. ♦ భాగస్వామ్యంలో వడ్డీ, జీతం, లాభంలో వాటాలు ఉన్న వారు ఫారం 3ని ఉపయోగించాలి. ♦ విదేశాల నుంచి ఆదాయం, ఆస్తులు, ఇతరత్రాలు ఉన్నవాళ్లు వేయొచ్చు. ♦ స్వంతంగా ఆదాయం డిక్లేర్ చేద్దామనుకున్న వాళ్లూ వేయొచ్చు. ♦ నష్టాలను రాబోయే సంవత్సరంలో సర్దుబాటు చేసుకోవాలనుకునే వారూ వేయొచ్చు. ఐటీఆర్ 4 ఫారం.. ♦ వ్యక్తులు, హిందూ ఉమ్మడి కుటుంబం ఈ ఫారం వేయొచ్చు. ♦ వ్యాపారంలో లెక్కలతో నిమిత్తం లేకుండా లేక వాటిని పరిగణనలోకి తీసుకోకుండా కొంత శాతాన్ని లాభంగా డిక్లేర్ చేసే విధానాన్ని ‘ఊహాజనిత ఆధారం’గా వ్యవహరిస్తారు. దీనికి కూడా ఈ ఫారంను ఉపయోగించవచ్చు. ♦ ఈ–ఫైలింగ్ తప్పనిసరి. ♦ 80 యేళ్లు దాటినవారికి, రూ. 5 లక్షల లోపు ఆదాయం గలవారికి మాత్రం తప్పనిసరి కాదు. ♦ ‘ఊహాజనిత ఆధారం’గా లెక్కించిన ఆదా యంతో పాటు జీతం, ఇంటి మీద ఆదాయం, ఇతర ఆదాయం ఉన్నవారు దీన్ని వేయొచ్చు. ♦ ఆదాయం రూ. 50,00,000 దాటినవారు ఈ ఫారం వేయొచ్చు. ♦ ఈ ఫారం వేసేవాళ్లు బుక్స్ రాయనక్కర్లేదు. ♦ టర్నోవరు రూ. 2 కోట్లు దాటిన వాళ్లు ఈ ఫారం ద్వారా రిటర్నులు వేయరాదు. ♦ 44 అఈ, 44 అఉ ప్రకారం ఈ పన్నులను లెక్కించవచ్చు. ♦ 44 అఈ ప్రకారం ఆదాయాన్ని టర్నోవరులో 8 శాతం కన్నా ఎక్కువ డిక్లేర్ చేయొచ్చు. ♦ 44 అఉ ప్రకారం రవాణా చేసే వాహనాలకైతే.. బండికి ఇంత ఆదాయమని నిర్దేశించారు. నెలకి ఒక్కో బండికి రూ.7,500కన్నా ఎక్కువ డిక్లేర్ చేసుకోవచ్చు. చివరగా.. ఈ–వెరిఫికేషన్ గతంలో చెప్పిన విధంగా చేయొచ్చు. ఏదేని కారణం వలన ఈ–వెరిఫై చేయకపోతే అక్నాలెడ్జ్‌మెంట్‌ని బెంగళూరు పంపవలసి ఉంటుంది. -
చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం కొనసాగుతోంది. వివరాలు...పలమనేరు మండలం గంటా ఊరులోని పంటపొలాలపై గజరాజులు దాడిచేసి వరి, బీన్స్, టమాటా పంటలను నాశనం చేశాయి. ఇలాంటి సంఘటనలు జరగడం ఈ నెలలో ఇది నాలుగోసారి కావడం గమనించదగ్గ విషయం. గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అడవుల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతోనే అవి జనంలోకి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు. -
రామకుప్పం మండలంలో గజరాజుల బీభత్సం
రామకుప్పం : చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో మరోసారి ఏనుగులు బీభత్సం సృష్టించాయి. మండలంలోని పెద్దూరు, రామాపురం తండా, ఎస్.గొల్లపల్లి గ్రామాల్లో సోమవారం అర్ధరాత్రి పొలాల్లోకి ప్రవేశించి పంటలపై దాడి చేశాయి. టమాట, సోయాబీన్స్, అరటి పంటలకు సుమారు రూ.2 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. అడవిలో తినడానికి ఆహారం, తాగడానికి నీరు దొరక్కపోవడంతో ఏనుగుల గుంపు రామకుప్పం మండలంలో నిత్యం ఎక్కడో చోట దాడులకు దిగుతూనే ఉంది. దీంతో గ్రామస్తులకు రాత్రిపూట నిద్ర కరువైంది. పొలాలకు రక్షణగా కాపలా కాయాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
రామకుప్పం మండలంలో ఏనుగుల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఏనుగులు మరోసారి బీభత్సం సృష్టించాయి. మండలంలోని ఎద్దులగడ్డ, గోవిందరాజపురం గ్రామాల్లోని పొలాల్లోకి గురువారం అర్ధరాత్రి 15 ఏనుగులు ప్రవేశించి బీభత్సం సృష్టించాయి. దీంతో భారీ మొత్తంలో పంట నష్టం సంభవించింది. ఈ హఠాత్పరిణామంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. -
రిచ్‌గా.. వెచ్చగా!
వెల్వెట్ ఘరానాగా ఉంటుంది. ‘ఎవరమ్మా ఈ యువరాణి, అంతఃపురం నుంచి దారి తప్పి ఇటుగా వచ్చిందీ!’ అన్నంత లుక్ ఇస్తుంది. వెల్వెట్ మృదువుగా ఉంటుంది. హృదయానికి దగ్గరగా వచ్చిన ప్రియసఖిలా అనిపిస్తుంది. ఇక చలికాలమైతే... వెచ్చని నెచ్చెలిలా అంటిపెట్టుకుని ఉంటుంది. ఆ ఘరాణా యువరాణి... ఆ మృదువైన ప్రియసఖి... ఆ వెచ్చని నెచ్చిలి ప్రత్యేకతలే ఈ వారం మన ‘ముస్తాబు’. ప్రాచీన కాలంలో ఖరీదైన దుస్తుల జాబితాలో ముందుండే మఖమల్ క్లాత్ ఈ రోజుల్లో అందరికీ అందుబాటులోకి వచ్చింది. చలి నుంచి రక్షణగా మారి, కనువిందు చేసే వెల్వెట్ గురించి ఎంత ఎక్కువైనా మాట్లాడుకోవచ్చు. పై నుంచి కిందవరకు ఆపాదమస్తకం వెల్వెట్ వెలుగులతో నింపేయవచ్చు. మఖమల్ మెత్తదనం ఒంటిని అల్లుకుపోతే చలికాలం వెచ్చని హాయితో హొయలు పోవచ్చు అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ల్లు. ‘వెల్వెట్’ అని ఆంగ్లంలో ముద్దుగా పిలుచుకునే ఈ ఫ్యాబ్రిక్‌తో సంప్రదాయ లంగా ఓణీలే కాదు, ఆధునికంగా బ్లేజర్లు, స్కర్టులూ ధరించవచ్చు. అనార్కలీ, గాగ్రాచోళీ, కుర్తీలు, టీ షర్ట్స్, బ్లేజర్స్.. ఇలా ఏ తరహా దుస్తుల్లోనైనా మఖమల్ ఇట్టే ఒదిగిపోతుంది. ఏ పాత్రలో పోస్తే నీరు అందులో అంతగా ఇమిడిపోయినట్టుగా మఖమల్ని ఎన్ని రకాలుగా మార్చినా, ఎన్ని భాగాలుగా తీసుకున్నా అతివల మేనికి అందంగా ఒదిగిపోతుంది. చూపులకు కాంతిమంతం, చుట్టుకుంటే మృదుత్వం కట్టుకుంటే కనువిందుచేసే సోయగం మఖమల్ సొంతం అంటూ మురిసిపోతారు. చూపరుల మదిని కొల్లగొడతారు. కార్పొరేట్ స్టైల్.. బ్లేజర్ ఎరుపు, ఆకుపచ్చ, నలుపు.. ఇలా మంచి కాంతిమంతమైన రంగులో ఉండే వెల్వెట్ బ్లేజర్ లోపల తెలుపు, క్రీమ్ కలర్ షర్ట్ ధరిస్తే ఆధునికంగా కనిపిస్తారు. వెల్వెట్ బ్లేజర్స్‌ను శరీరాకృతికి తగ్గట్టు మంచి ఫిటింగ్ ఉండేలా చూసుకోవాలి. బాటమ్‌గా స్లిమ్ జీన్స్, కాటన్ ట్రౌజర్స్.. లేత రంగులున్నవి ధరించాలి. ఈ తరహా వస్త్రాలంకరణ కార్పొరేట్ ఉద్యోగులకు బాగా నప్పుతుంది. సాయంకాలం వేడుకగా. సాయంకాలం పార్టీలకు వెల్వెట్ ట్రౌజర్స్ ప్రత్యేక ఆకర్షణీయంగా ఉంటాయి. 1970ల స్టైల్ కావాలనుకుంటే ట్రౌజర్, బ్లేజర్ రెండూ వెల్వెట్‌వి ధరించవచ్చు. వెల్వెట్ ట్రౌజర్ ధరించినప్పుడు టాప్స్‌కి పూర్తి భిన్నమైన రంగులు, క్లాత్‌తో డిజైన్ చేసిన టాప్స్ వాడితే ఆకర్షణీయంగా కనిపిస్తారు. ఇలాంటి వస్త్రధారణ ఫార్మల్‌గానూ, క్యాజువల్‌గానూ బాగుంటుంది. యుక్తవయసుకు నచ్చిన నేస్తం... టీన్స్ ఫ్రెండ్లీ ఫ్యాబ్రిక్ వెల్వెట్. కురచ డ్రెస్సులను ఇష్టపడే అమ్మాయిలను ఆకట్టుకునే ఫ్యాబ్రిక్ ఇది. అలాగే మృదువుగా ఉండటంతో సౌకర్యంగా అనిపిస్తుంది. పెద్దగా సాగే గుణం ఉండదు. కాటన్ వెల్వెట్ అయితే చెమటను పీల్చుకునే గుణం కూడా ఉంటుంది. తడిగా ఉన్న పొడిగానే చూపులకు కనిపిస్తుంది. అంతేకాదు, చలిని కట్టడి చేసి ఒంటికి వెచ్చదనాన్ని ఇస్తుంది. దీంతో చలికాలం ఫ్యాషనబుల్ ఫ్యాబ్రిక్‌గా వెలుగొందుతుంది. స్టైల్‌గా, స్మార్ట్‌గా, స్టన్నింగ్‌గా అనిపించే ఫ్యాబ్రిక్ వెల్వెట్ కావడంతో ఈ క్లాత్‌పై మగ్గం పనితీరు పురుడుపోసుకుంది. జర్దోసీ జిగేల్మంటుంది. అద్దాలు మిరుమిట్లుగొలుపుతున్నాయి. చమ్కీలు చమక్కుమంటున్నాయి. అందుకే యుక్తవయసు అమ్మాయిలకు నచ్చిన నేస్తం వెల్వెట్. తరాల అంతరాలు లేని ఫ్యాబ్రిక్... రాచరికానికి కొత్త హంగులు అద్దిన ‘మఖమల్’ ఫ్యాషన్ రంగంలోకి అడుగుపెట్టి సామాన్యుడిని సైతం పలకరించింది. సింగిల్‌గానే కాదు నీరు ఏ పాత్రలో పోస్తే అందులో ఒదిగిపోయినట్టుగా వెల్వెట్ ఏ ఫాబ్రిక్‌తో కలిస్తే ఆ రూపంతో సొబగులు అద్దుకుంటూ వచ్చింది. కాని తన గుర్తింపును మాత్రం ఏ మాత్రం కోల్పోకుండా అదే హంగు, ఆర్భాటంతో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. అంతే డిజైనర్ల లుక్‌ను ఆటోమేటిగ్గా తన వైపుకు తిప్పుకుంది. తన చుట్టూ ప్రదక్షిణలు చేయించింది. చేయిస్తూ ఉంది. సంప్రదాయ తరహాలో ‘కుందనపుబొమ్మల’ను తీర్చిదిద్దే మఖమల్ ఆధునిక తరహాలో ర్యాంప్షోలపైనా షార్ట్స్‌గా హొయలు పోతోంది. అందుకే చలికాలాన ఈ నెచ్చలితో దోస్తీ కట్టడానికి, మేనికి కొత్త సింగారాలు అద్దడానికి మగువలు ముస్తాబవుతున్నారు. -
స్థితప్రజ్ఞుడే శ్రీమంతుడు
ఓ ప్రశాంత ఏకాంత సమయాన రాధాకృష్ణుల మధ్య సంభాషణ ఇలా సాగింది. రాధ: కృష్ణా! నీవింత సుకుమారంగా కనిపిస్తావు, నీ శ్యామల రూపం సమ్మోహన ప్రేమ పరిమళాలను వెదజల్లుతూ ఉంటుంది. అపారమైన ప్రేమ కారుణ్యాలు నీ యెదలో తాండవిస్తాయి. కానీ నాదొక సందేహం... కృష్ణుడు: సందేహమెందుకు? అడుగు రాధా! రాధ: అంతులేని అల్లరి చేష్టలు, వాటితోపాటు రాక్షస సంహారాలు... ఇవన్నీ ఏమిటో నాకర్థం కావటం లేదు కృష్ణా! కృష్ణుడు: రాధా! నాకు శత్రువులెవ్వరూ లేరు, పనిగట్టుకుని నేనెవ్వరినీ సంహరించడమూ లేదు. ఇవన్నీ ప్రకృతి పరిధిలోనే జరుగుతున్నాయి. దాని నిమయనిర్ణయాల మేరకు జనన మరణాల ప్రస్థానం నాటకీయంగా సాగుతోంది. సృష్టిలోని ప్రతి క దలిక వెనుక ప్రేరణాత్మకమైన ప్రకృతిసూత్రం ఇమిడి ఉంటుంది. చూడు ప్రియసఖీ! రైతు నేలలో విత్తనాలను పాతిపెడతాడు. ద్వేషం చేత కాదు కదా! ఆ విత్తనానికి రైతు చర్య అర్థం కాకపోవచ్చు కాని జరిగేదేమిటంటే ఆ విత్తనంలోంచే పచ్చని మొలక అంకురించి మొక్కగా, చెట్టుగా పరిణతి చెంది ఫలభరితమౌతుంది. అంటే విత్తనంగా మరణిస్తేగాని మొలకగా అంకురించే అవకాశమే లేదు కదా! ఈ విధంగానే జననమరణాల గమనం కూడా. మరణం పాలబుగ్గల పరిశుద్ధ శిశోదయానికి ముఖద్వారమవుతుంది. చైతన్యవంతమైన ఆత్మకు మరణమెక్కడిది? వివిధ రూపాలుగా అవతరించి మార్పు చెందడం తప్ప. ఈ అవగాహన రహితమైన మనస్సు అనుకూలతను కారుణ్యంగా, ప్రతికూలతను కాఠిన్యంగా భావిస్తుంది. ఈ ప్రకృతే దైవాకృతి. ఈ వైవిధ్య రూపాలన్నీ ప్రకృతి యొక్క విభిన్న పాత్రలే, జనన మరణాలు, సుఖదుఃఖాలు, చీకటి వెలుగులనే ద్వంద్వాలను కల్పించి చిద్విలాస క్రతువు నిరంతరాయంగా జరుపుతుంది ఆ అఖండ జ్ఞానస్వరూపిణియైన పరాప్రకృతి. ఈ జ్ఞానమెరిగి జీవించువాడే స్థితప్రజ్ఞుడు. ఈ జ్ఞానమెరిగి పయనించువాడే మందస్మిత శ్రీమంతుడు... అని ప్రబోధించాడు కలువ కన్నుల కన్నయ్య. ఆ ప్రబోధంతో రాధ హృదయం ప్రకాశించి, ‘‘ప్రభూ! ఆ సూత్రమూ, ఆ జ్ఞానమూ, ఈ పంచభూతాత్మక విశ్వమూ నీవే కదా! ప్రత్యేకించి ‘ప్రకృతి’ అని సంబోధిస్తావెందుకు?’’ అని రాధమ్మ అంటే అవునన్నట్లు మందహాసంతో తన మధుకాంతిని రాధమీద ప్రసరించి తన అనన్యస్థితిని ప్రకటించాడు కృష్ణ పరమాత్మ. - (రామకృష్ణానంద రచించిన ‘ఆరాధనామాధవుడు’ నుంచి)