చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో గజరాజుల బీభత్సం కొనసాగుతోంది. వివరాలు...పలమనేరు మండలం గంటా ఊరులోని పంటపొలాలపై గజరాజులు దాడిచేసి వరి, బీన్స్, టమాటా పంటలను నాశనం చేశాయి. ఇలాంటి సంఘటనలు జరగడం ఈ నెలలో ఇది నాలుగోసారి కావడం గమనించదగ్గ విషయం. గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటవీ అధికారులు స్పందించి ఏనుగులు గ్రామాల్లోకి రాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. అడవుల్లో ఆహారం, నీరు దొరకకపోవడంతోనే అవి జనంలోకి వస్తున్నాయని అటవీ అధికారులు చెబుతున్నారు.