మార్క్‌ యువర్‌ కాలెండర్‌, కొత్త బైక్‌ కమింగ్‌ | Revolt RV 400 AI-Enabled Electric Bike Rolls Off the Assembly Line, Launch on August 28 | Sakshi
Sakshi News home page

మార్క్‌ యువర్‌ కాలెండర్‌, కొత్త బైక్‌ కమింగ్‌

Published Wed, Aug 7 2019 8:58 PM | Last Updated on Wed, Aug 7 2019 8:58 PM

Revolt RV 400 AI-Enabled Electric Bike Rolls Off the Assembly Line, Launch on August 28 - Sakshi

సాక్షి,  న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌ సహ-వ్యవస్థాపకుడు రాహుల్‌ శర్మకు చెందిన ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ స్టార్టప్‌ ‘రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌’ తన తొలి వాహనాన్ని కమర్షియల్‌గా లాంచ్‌   చేయనుంది. ‘ రివోల్ట్‌ ఆర్‌వీ 400’  పేరుతో పరిచయం చేసిన  ఈ ఎలక్ట్రిక్‌ మోటార్‌ సైకిల్‌ను  ఆగస్టు 28న లాంచ్‌ చేయనున్నామని రివోల్ట్‌ ఇంటెల్లీకార్ప్‌ వ్యవస్థాపకులు రాహుల్‌ శర్మ  ట్విటర్‌లో వెల్లడించారు.   
  
దేశంలో తొలిసారిగా కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ బైక్‌ను ఒకసారి పూర్తిగా చార్జ్‌ చేస్తే 156 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. ఆర్‌వీ 400 బ్యాటరీని 4 గంటల్లో పూర్తిగా చార్జ్‌ చేసుకోవచ్చు.  ఢిల్లీ వినియోగదారులు కోసం  వెయ్యి రూపాయలతో జూన్ 25 నుంచి బుకింగ్స్ ను  ప్రారంభించిన సంగతి తెలిసిందే.

వచ్చే నాలుగు నెలల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, పుణె, బెంగళూరు, హైదరాబాద్‌, నాగ్‌పూర్‌, అహ్మదాబాద్‌, చెన్నై మార్కెట్లోకి ఈ వాహనాన్ని విడుదల చేయనుంది. అలాగే చార్జింగ్‌ కోసం కంపెనీ ఆన్‌బోర్డ్‌, పోర్టబుల్‌ చార్జింగ్‌ ఫీచర్లను ఆఫర్‌ చేస్తోంది. ఈ సంస్థ హరియాణాలోని మనేసర్‌లో ఏటా 1.2 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో కూడిన ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు  కంపెనీ ప్రకటించింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement