ముంబై : కర్నాటక ఎన్నికల ఫలితాలు ఇటు స్టాక్ మార్కెట్లు, అటు రూపాయిపై తీవ్ర ప్రభావం చూపాయి. నేడు విడుదలైన ఫలితాల్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే మెజార్టీ రాకపోయే సరికి ఈ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. దీంతో ఫారెక్స్ మార్కెట్ సెంటిమెంట్‌పై తీవ్ర ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో డాలర్‌తో రూపాయి మారకం విలువ భారీగా పడిపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 2017 జనవరి నుంచి తొలిసారి 68 మార్కుకు కిందకి క్షీణించింది. గత ముగింపు కంటే 59 పైసలు ఢమాల్‌మని 68.11 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్‌కు డిమాండ్ కూడా భారీగా పెరుగుతోంది. ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్స్చేంజ్ మార్కెట్ వద్ద పౌండ్ స్టెర్లింగ్ కూడా రూ.91.28/92.00 వద్ద క్లోజైంది.
తీవ్ర ఉత్కంఠ రేపిన కర్నాటక ఫలితాలు, క్షణక్షణం మారుతూ వచ్చాయి. ఓటింగ్ ప్రారంభమైనప్పుడు కమలం విజయం దిశగా దూసుకెళ్లగా మార్కెట్లు జోరున ఎగిశాయి. కానీ మధ్యాహ్నం సమయానికల్లా రాజకీయ సమీకరణాలు మారిపోయి, బీజేపీకు చెక్ పెట్టేందుకు జేడీఎస్, కాంగ్రెస్ పొత్తులో ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించాయి. దీంతో స్టాక్ మార్కెట్లలో తీవ్ర అమ్మకాల ఒత్తిడి నెలకొంది. సెన్సెక్స్‌కు ప్రారంభ లాభాలన్నీ ఆవిరైపోయి, చివరికి 13 పాయింట్ల స్వల్ప లాభంలో ముగిసింది. నిఫ్టీ కూడా 10801 వద్ద సెటిలైంది. ఇటు రూపాయి విలువ కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంది. మరోవైపు గత కొన్ని రోజులుగా కూడా ముడి చమురు ధరలు పెరుగుతుండటం రూపాయి విలువను దెబ్బతీస్తూ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment