సాక్షి, ముంబై : అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్ల కోతపై తాజా అంచనాలతో ఆసియా దేశాల కరెన్సీలు బాగా పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా భారత కరెన్సీ రూపాయి డాలరు మారకంలో బలపడుతోంది. ఇటీవల డాలరుతో పోలిస్తే బలహీనంగా మారిన రూపాయి గురువారం 0.36 శాతం ఎగిసి 11 నెలల గరిష్టాన్ని తాకింది.
ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గురువారం రూపాయి 26 పైసలు ఎగసి 68.32 వద్ద ప్రారంభమైంది. అనంతరం పుంజుకుని 68.30 వద్ద ఉంది. బుధవారం రూపాయి 7పైసలు బలహీనపడి 68.58 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. అటు ఈక్విటీ మార్కెట్లు వరుస నష్టాలనుంచి కోలుకున్నాయి. గురువారం డబుల్ సెంచరీ లాభాలతో కొనసాగుతోంది సెన్సెక్స్. నిఫ్టీ కూడా బలమైన ట్రెండ్‌తో 11550కి ఎగువన ట్రేడ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment