సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ బుధవారం మరింత బలహీనంగా ప్రారంభమైంది. మంగళవారం నాటి ముగింపు 68.07తో పోలిస్తే డాలరు మారకంలో రూపాయి 68.14 వద్ద మొదలైంది. ప్రస్తుతం7పైసల నష్టంతో 68.11 వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్ ర్యాలీ దేశీయ కరెన్సీలో అమ్మకాలు దారితీస్తోంది. దీంతోపాటు దేశీయంగా తీవ్రంగా పెరుగుతోన్న వాణిజ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు అందోళనలు , చమురు ధరలు భారత ఆర్థిక వ్యవస్థకు ప్రతికూలంగా మారుతున్నాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణం కూడా భారతీయ కరెన్సీని ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment