ముంబై: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి. బంగారం, క్రూడాయిల్ ధరలు పెరుగుతున్నాయి. ఈ ప్రభావం ఆసియా మార్కెట్లపై కూడా పడింది. దీంతో భారతీయ మార్కెట్లో నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. చమురు ధరలు అంతకంతకు పెరగుతుండటంతో డాలర్‌తో రూపాయి మారకం విలువ సోమవారం 31 పైసలు తగ్గి 72.11 వద్ద ట్రేడ్ అయింది. ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా రూపాయి 42 పైసలు పడిపోయిన శుక్రవారం ఒకటిన్నర నెలల కనిష్ట స్థాయి 71.80 వద్ద ముగిసింది.
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసీమ్ సోలేమని హత్యకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భగ్గమంటున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి 72 స్థాయికి చేరింది. సోమవారం ఇంటర్ బ్యాంక్ ఫారన్ ఎక్స్చేంజ్‌లో డాలర్‌తో రూపాయి 72.03 వద్ద ప్రారంభమైం కాసేపటిటే 72.11కి పడిపోయింది. చివరికి 13పైసల నష్టంతో 71.93 వద్ద ముగిసింది. కాగా అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌కు 70.59 (2.90 శాతం) పెరిగింది. మరోవైపు అమెరికా-ఇరాన్ యుద్ధ భయాల నేపథ్యంలో ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి.సెన్సెక్స్ ఏకంగా 788, నిఫ్టీ 234 పాయింట్ల నష్టంతో ముగిసాయి.
Comments
Please login to add a commentAdd a comment