
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చుకుంటే వెలవెల బోయింది. దాదాపు 54 పైసలు నష్టోయింది. ఇటీవల స్థిరంగా కదలాడిన రూపాయి నేటి ట్రేడింగ్‌లో భారీగా 54 పైసలు బలహీనపడి 64.04 గా నమోదైంది. బంగారం, చమురు ఎగుమతుల, దిగుమతుల మధ్య వ్యత్యాసం పెరగడం దీనికి కారణమని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. పుంజుకున్న డాలర్ విలువ, ముడిచమురు, బంగారం దిగుమతులు గణాంకాలను వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించడంతో రూపాయి బలహీనపడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబరులో దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం (వాణిజ్య లోటు) 14.88 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైన లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అయితే ఐటీ సెక్టార్‌లో భారీగా నెలకొన్న కొనుగోళ్లు మార్కెట్లు బాగా మద్దతిస్తున్నాయి.
కాగా సోమవారం రూపాయి 14 పైసలు బలపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగియగా, ఎగుమతిదారులు డాలర్ అమ్మకాలపై అమెరికా కరెన్సీకి వ్యతిరేకంగా 63.49 పాయింట్ల వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment