weakens
-
అయ్యయ్యో.. రూపాయి...ఈ పతనం ఎందాకా?
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయికి కష్టాలు తప్పడం లేదు. సోమవారం మరో రికార్డు కనిష్టానికి జారుకుంది. గ్లోబల్ మాంద్యం, ముడిచమురు సరఫరా, మార్కెట్లలో మిశ్రమ సెంటిమెంట్‌పై పెట్టుబడిదారుల ఆందోళన నేపథ్యంలో డాలరు మారకంలో రూపాయి 79.40 వద్ద ఆల్ లైం కనిష్టాన్ని నమోదు చేసింది. శుక్రవారం79.26 వద్ద ముగిసింది. గత రెండు వారాలుగా అత్యంత కనిష్ట స్థాయిలకు చేరుతున్న రూపాయి ప్రస్తుతం 80 మార్క్‌కు చేరువలో ఉండటం ఆందోళన రేపుతోంది. దేశీయ,అంతర్జాతీయ ద్రవ్యోల్బణ డేటాపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థికవృద్ధి ఆందోళన, చమురు మార్కెట్లో అస్థిరత డాలర్‌కు బలాన్నిస్తోందని పేర్కొన్నారు. మరోవైపు వరుసగా మూడు సెషన్ల లాభాలకు స్వస్తి చెప్పిన స్టాక్‌మార్కెట్ నష్టాల్లో ట్రేడ్ అవుతోంది. సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి 54156 వద్ద, నిఫ్టీ 87 పాయింట్ల నష్టంతో 16137 వద్ద కొనసాగుతోంది. కాగా రోజుకు మరింత పతనమవుతున్న రూపాయని ఆదుకునేందుకు ఇటీవల ఆర్బీఐ కొన్ని చర్యల్ని ప్రకటించింది. ముఖ్యంగా విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు కొన్ని సవరణలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. -
బలహీనపడిన అల్పపీడనం..
సాక్షి, విశాఖపట్నం: తూర్పు రాజస్థాన్, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతుంది. పశ్చిమ దిశగా ప్రయాణిస్తూ రాగల రెండు రోజుల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు ఉత్తర బంగాళాఖాతం లో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ లో కొన్నిచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ నెల 25 నుండి క్రమేణా వర్షాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. -
బంగారానికి ప్రతికూలమే!
న్యూఢిల్లీ: బంగారం ధరలు గత వారంలో తక్షణ నిరోధ స్థాయి ఔన్స్ 1,230 డాలర్లను అధిగమించలేకపోయాయి. డిసెంబర్ నెల బంగారం ఫ్యూచర్స్ ఏ మార్పు లేకుండా ఔన్స్ 1,223.50 డాలర్ల వద్దే ఉండిపోయింది. గత శుక్రవారం చమురు ధరలు ఒక్కరోజే 7 శాతం పతనం చెందడం తెలిసిందే. చమురు ధరల పతనం కమోడిటీ మార్కెట్ల పట్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్‌కు విఘాతం కలిగించిందని, ఇది బంగారానికి కూడా ప్రతికూలమేనని కామర్జ్ బ్యాంకు కమోడిటీ రీసెర్చ్ హెడ్ యూజెన్వీన్బర్గ్ పేర్కొన్నారు. తక్కువ చమురు ధరలు ద్రవ్యోల్బణ అంచనాలపైనా ప్రభావం చూపిస్తాయన్నారు. బలహీన అయిల్ మార్కెట్ బంగారం ర్యాలీకి కష్టమేనని లండన్ క్యాపిటల్ గ్రూపు రీసెర్చ్ హెడ్ జాస్పర్ లాలెర్ అభిప్రాయపడ్డారు. అయితే, అంతర్జాతీయంగా పెరుగుతున్న ఆర్థిక అనిశ్చితి వాతావరణం అన్నది సురక్షిత పెట్టుబడి సాధనాలకు అనుకూలమేనన్నారు. సమీప కాలంలో ఔన్స్ బంగారం ధర 1,200 డాలర్ల పైనే కొనసాగొచ్చన్న అభిప్రాయాన్ని కూడా తెలిపారు. దేశీయంగా తగ్గిన డిమాండ్ అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, స్థానిక జ్యుయలర్స్ నుంచి డిమాండ్ తగ్గడం తదితర కారణాల వల్ల బంగారం ధరలు గత వారం 10 గ్రాములకు రూ.32,000లోపునకు దిగొచ్చాయి. 10 గ్రా.కు రూ.400 తగ్గి రూ.31,750కు చేరాయి. -
బలహీనులకు అండ మహా ప్రవక్త
పూర్వం అరబ్బు సమాజంలో కట్టు బానిసత్వం ఉండేది. బానిసను పశువుకంటే హీనంగా చూసేవారు యజమానులు. ఏదైనా తేడా వస్తే గొడ్డును బాదినట్లు బాదేవారు. రెండు పూటలా తిండి దొరికితే చాలన్నట్లు బానిసలు గొడ్డు చాకిరీ చేసేవాళ్లు. ఆ కాలంలో నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి) అనే కట్టు బానిస ఉండేవారు. ఆయన ఒకరోజు తాను ఇస్లామ్ ధర్మం పట్ల ఎలా ఆకర్షితులయ్యారో వివరించారు. ‘‘నాకు ఒకరోజు తీవ్ర చలి జ్వరం సోకింది. బండెడు చాకిరీ చేయించే నా యజమాని అంత జ్వరంలోనూ ఎన్నో కిలోల బార్లీ విసరాలని పురమాయించాడు. చలికి తోడు జ్వరం ఇబ్బందిపెట్టడంతో కంబళి కప్పుకొని పాలు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుందామని మేను వాల్చేసరికి నిద్రపట్టింది. అంతలోనే అటుగా వచ్చిన నా యజమాని నేను నిద్రించడం చూసి నన్ను గొడ్డును బాదినట్లు నిర్దయగా కొట్టాడు. చలిజ్వరంతో బాధపడుతున్నానన్న కనికరం కూడా చూపకుండా నా ఒంటిపై కంబళిని లాక్కొని పిండి విసరాలని నిర్బంధించాడు. చేసేదేం లేక రోదిస్తూ బార్లీ గింజలను విసుర్రాయిలో వేసి బలాన్ని కూడగట్టుకుని విసరసాగాను. అంతలో ముహమ్మద్ ప్రవక్త (సఅసం) అటు పక్కనుంచే వెళుతున్నట్లున్నారు. నేను మూలుగుతున్న శబ్దానికి లోనికి వచ్చి ‘‘ఎందుకేడుస్తున్నావు. ఏం కష్టమొచ్చింది’’ అని అడిగారు. దానికి నేను ‘పోపో నీ పని నువ్వు చూసుకో. అందరూ అడిగేవారే కానీ ఆదుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు. పోపో’ అని విసుక్కున్నాను. నా మాటలకు ప్రవక్త మహనీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు కానీ కాసేపటికే వారు ఒక చేతిలో వేడి వేడి పాలచెంబు, మరో చేతిలో ఖర్జూరాలను తీసుకొచ్చారు. పాలను తాగించారు. ఖర్జూరాలను తినిపించారు. ఆ తరువాత నన్ను ‘‘వెళ్లి కంబళి కప్పుకొని హాయిగా విశ్రాంతి తీసుకో, నీ బదులు నేను విసురుతాను.’’ అని విసుర్రాయి తిప్పడం మొదలెట్టారు. ఉదయాన్నే లేవగానే రాత్రంతా పట్టిన పిండిని నాకు అప్పజెప్పి వెళ్లిపోయారు. రెండోరోజు రాత్రి కూడా ప్రవక్త మహనీయులు పాలచెంబు, ఖర్జూరాలతో ప్రత్యక్షమయ్యారు. నన్ను వెచ్చటి దుప్పటిలో నిద్రపుచ్చి విసుర్రాయి విసరసాగారు. ఇలా మూడు రోజులు ప్రవక్త మహనీయులు నా పని తన భుజాలపై వేసుకుని నాకు విశ్రాంతి కల్పించారు. మూడోరోజు ఉదయాన్నే ప్రవక్త వెళుతుండగా నేను ఆయనను ఆలింగనం చేసుకుని ‘మీగురించి సమాజం తప్పుగా మాట్లాడుతోంది. మీపై బురదజల్లేందుకు మీగురించి దుష్పచ్రారం చేస్తున్నారు. బానిసలపట్ల జాలి, దయ, కరుణ చూపే మీరు నిజంగా దేవుని ప్రవక్త అని నేను విశ్వసిస్తున్నానని విశ్వాసం ప్రకటించాను.’’ అని చెప్పుకొచ్చారు. బలహీను లకు అండగా నిలిచేవారే నిజమైన నేతలు, ప్రవక్తలు. – ముహమ్మద్ ముజాహిద్ -
రూపాయి బలహీనం
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మంగళవారం నాటి ట్రేడింగ్‌లో డాలర్‌తో పోల్చుకుంటే వెలవెల బోయింది. దాదాపు 54 పైసలు నష్టోయింది. ఇటీవల స్థిరంగా కదలాడిన రూపాయి నేటి ట్రేడింగ్‌లో భారీగా 54 పైసలు బలహీనపడి 64.04 గా నమోదైంది. బంగారం, చమురు ఎగుమతుల, దిగుమతుల మధ్య వ్యత్యాసం పెరగడం దీనికి కారణమని ఎనలిస్టులు పేర్కొంటున్నారు. పుంజుకున్న డాలర్ విలువ, ముడిచమురు, బంగారం దిగుమతులు గణాంకాలను వాణిజ్య మంత్రిత్వశాఖ వెల్లడించడంతో రూపాయి బలహీనపడిందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. డిసెంబరులో దిగుమతులు, ఎగుమతుల మధ్య వ్యత్యాసం (వాణిజ్య లోటు) 14.88 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అటు దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైన లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. అయితే ఐటీ సెక్టార్లో భారీగా నెలకొన్న కొనుగోళ్లు మార్కెట్లు బాగా మద్దతిస్తున్నాయి. కాగా సోమవారం రూపాయి 14 పైసలు బలపడింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు రికార్డు స్థాయిలో ముగియగా, ఎగుమతిదారులు డాలర్ అమ్మకాలపై అమెరికా కరెన్సీకి వ్యతిరేకంగా 63.49 పాయింట్ల వద్ద ముగిసింది. -
డాలర్‌కు ఫెడ్ ఆందోళన సెగ
న్యూయార్క్: అమెరికా కరెన్సీ డాలర్‌కు ఫెడ్ షాక్ తగిలింది. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బుధవారం పడిపోయింది. అమెరికా డేటా, ద్రవ్యోల్బణంపై విధాన నిర్ణేతలు ఆందోళన నేపథ్యంలో డాలర్ ఐదు నెలల్లో చెత్త వన్డే ప్రదర్శనను నమోదు చేసింది. దీంతో దేశీయ కరెన్సీ లాభాలతో ప్రారంభమైంది.డాలర్ మారకంలోమ రూపీ 0.06పైసల లాభంతో 64.83 వద్ద కొనసాగుతోంది. అటు యూరోకూడా డాలర్ మారకరంలో అయిదురోజుల గరిష్టానికి చేరింది. ఫెడరల్ రిజర్వు ఇటీవలి విధాన సమావేశం మినిట్స్విడుదల, బలహీనమైన అమెరికా డేటా, టెక్నికల్ ట్రేడింగ్ కారణాల రీత్యా బుధవారం ఇతర కరెన్సీలతోపోలిస్తే అక్టోబర్ నెలలో కనిష్టస్థాయికి పడిపోయింది. అలాగే గత ఐదునెలల్లో ఇంట్రాడే కనిష్టాన్ని నమోదు చేసింది. అటు మిచిగాన్ యూనివర్సిటీవినియోగదారుల సెంటిమెంట్ రిపోర్ట్ కూడా దీర్ఘకాలిక ద్రవ్యోల్బణం క్షీణిస్తుందని అంచనా వేసింది. -
బలహీనపడుతున్న వాయుగుండం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జార్ఖండ్‌లో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. అది కాస్తా బలహీనపడే అవకాశాలున్నాయి. తిరిగి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం పెద్దగా ఉండబోదని పేర్కొంది.