
న్యూఢిల్లీ: రైల్వేలకు చెందిన రెండు కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ క్వార్టర్లో రానున్నాయి. రైల్వే వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌వీఎన్‌ఎల్), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్ప్ (ఐఆర్‌ఎఫ్‌సీ) ఐపీఓలను ఈ సెప్టెంబర్ క్వార్టర్లో తేవాలని ప్రభుత్వం యోచిస్తోందని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు చెప్పారు.
రైల్వేలకే చెందిన రీట్స్ ఐపీఓ రేపటి(ఈ నెల 20) నుంచి మొదలవుతోంది. ఈ కంపెనీ రూ.180–185 ప్రైస్‌బ్యాండ్‌తో రూ.460 కోట్లు సమీకరిస్తుందని అంచనా.ఈ నెల 22న ముగిసే ఈ ఐపీఓలో 12 శాతం వాటాకు సమానమైన 2.52 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. రీట్స్ ఐపీఓ తర్వాత ఆర్‌వీఎన్‌ఎల్, ఐఆర్‌ఎఫ్‌సీ ఐపీఓలు వస్తాయని ఆ అధికారి వివరించారు.