65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్ | Sagar Cements board nod for 6 MW waste heat recovery plant | Sakshi
Sakshi News home page

65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్

Published Sat, Mar 12 2016 1:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:30 PM

65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్

65 కోట్లతో సాగర్ సిమెంట్స్ వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సాగర్ సిమెంట్స్ రూ. 65.23 కోట్ల వ్యయంతో 6 మెగావాట్ల సామర్థ్యం గల వేస్ట్ హీట్ రికవరీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుంది. నల్లగొండ జిల్లా మట్టంపల్లిలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి శుక్రవారం సమావేశమైన బోర్డు ఆమోదముద్ర వేసింది. దీనికి కావాల్సిన నిధులను రుణాలు, అంతర్గత వనరుల ద్వారా సమకూర్చుకోనున్నట్లు కంపెనీ తెలిపింది. రూ. 10 ముఖ విలువ కలిగిన ప్రతీ షేరుకు 50 శాతం డివిడెండ్ (రూ. 5)ను ప్రకటిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. దీనికి రికార్డు తేదీ మార్చి 23గా నిర్ణయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement