హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆంధ్రా సిమెంట్స్‌కు చెందిన విశాఖపట్నం యూనిట్‌లో కార్యకలాపాలను కొనసాగించరాదని సాగర్ సిమెంట్స్ బోర్డు నిర్ణయించింది. నగర పరిధిలోకి ఈ యూనిట్ రావడమే కంపెనీ నిర్ణయానికి కారణం. విశాఖ యూని ట్ 107 ఎకరాల్లో విస్తరించింది.
ఆంధ్రా సిమెంట్స్ వైజాగ్ యూనిట్ స్థలాన్ని విక్రయించే ప్రయత్నాలను చేస్తామని సాగర్ సిమెంట్స్ జేఎండీ శ్రీకాంత్ రెడ్డి ఇన్వెస్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్ కాల్‌లో వెల్లడించారు. రుణ భారంతో ఉన్న ఆంధ్రా సిమెంట్స్ తాజాగా సాగర్ సిమెంట్స్ పరం అయిన సంగతి తెలిసిందే. డీల్ విలువ రూ.922 కోట్లు. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ అమరావతి బెంచ్ ఈ మేరకు ఆమోదం తెలిపింది. జేపీ గ్రూప్‌నకు చెందిన ఆంధ్రా సిమెంట్స్‌కు గుంటూరు జిల్లా దాచేపల్లిలో క్లింకర్, సిమెంట్ ప్లాంటు, విశాఖపట్నం వద్ద గ్రైండింగ్ యూనిట్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment