శాంసంగ్ ఎం మొబైల్స్‌.. బడ్జెట్‌ ధరల్లో | Samsung Galaxy M Series mobiles Launched in India | Sakshi
Sakshi News home page

శాంసంగ్‌ ఎం మొబైల్స్‌.. బడ్జెట్‌ ధరల్లో

Published Mon, Jan 28 2019 6:51 PM | Last Updated on Mon, Jan 28 2019 8:18 PM

Samsung Galaxy M Series mobiles  Launched in India  - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: శాంసంగ్‌ ఎం సిరీస్‌ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లు లాంచ్‌ అయ్యాయి. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న గెలాక్సీ ఎం 10, గెలాక్సీ ఎం 20 స్మార్ట్‌ఫోన్లు సోమవారం అధికారంగా విడుదల య్యాయి. డ్యుయల్‌ కెమెరా సెటప్‌, ఇన్‌ఫినిటీ వి డిస్‌ప్లే తో వీటిని తీసుకొచ్చింది. ఫిబ్రవరి 5వ తేదీనుంచి  ప్రత్యేకంగా అమెజాన్‌, శాంసంగ్‌ ఈ స్టోర్‌ ద్వారా ఈ డివైస్‌లు లభ్యం కానున్నాయి.

గెలాక్సీ ఎం10ను రెండు వేరియంట్లలో లాంచ్‌ చేసింది. 2జీబీ ర్యామ్‌/16జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధరను రూ.7990గా నిర్ణయించగా, 3జీబీ ర్యామ​ /32 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధరను రూ.8990గా ఉంచింది.
గెలాక్సీ ఎం 20 కూడా రెండు వెర్షన్‌లలొ అందుబాటులోకి తీసుకు వచ్చింది. 3జీబీ ర్యామ్‌/32జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర రూ.10,990గానూ,  4జీబీ ర్యామ్‌/64జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర రూ. 12,990గా ఉంది.

శాంసంగ్‌ గెలాక్స్‌ ఎం 10 ఫీచర్లు
6.2 అంగుళాల  డిస్‌ప్లే
720x1520 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఎక్సినాస్‌ 7870 సాక్‌​
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
13+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌  కెమెరా
5 ఎంపీ సెల్పీ కెమెరా
3400 ఎంఏహెచ్‌ బ్యాటరీ

శాంసంగ్‌ గెలాక్సీ ఎం20 ఫీచర్లు
6.3 అంగుళాల  డిస్‌ప్లే
1080x2340 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఎక్సినాస్‌ 7904 సాక్‌​
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
13+5 ఎంపీ డ్యుయల్‌ రియర్‌  కెమెరా
8 ఎంపీ సెల్పీ కెమెరా
5000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఫాస్ట్‌ చార్జింగ్‌

లాంచింగ్ ఆఫర్‌
జియో ద్వారా ప్రత్యేక లాంచింగ్‌ ఆఫర్‌ కూడా ఉంది.  రూ.198లకు జియె ప్యాక్‌పై డబుల్‌ డేటా ప్రయెజనాలను అందిస్తోంది. రోజుకు 4జీబీ డేటా చొప్పున 10 నెలలు పాటు ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్‌తో జియో వినియోగదారులకు రూ.3110ల అదనపు ప్రయోజనం లభించనుందని శాంసంగ్‌ వెల్లడించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement