ఎస్బీఐకి ఐదు అవార్డులు
ముంబై: ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంక్ ఎస్బీఐ తాజాగా డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ ‘ఇండియా టాప్ బ్యాంక్స్ అండ్ బ్యాకింగ్ అవార్డ్స్-2016’ పదవ ఎడిషన్‌లో ఐదు అవార్డులను పొందింది. ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఎనిమిది కేటగిరిలకు గానూ ఐదింటిలో ఈ అవార్డులను కైవసం చేసుకుంది. రిటైల్ బ్యాంకింగ్, రూరల్ రీచ్, గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్, టెక్నాలజీ అడాప్షన్, ఓవరాల్ బెస్ట్ బ్యాంక్ అనేవి ఐదు కేటగిరిలు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఎస్బీఐ కీలకపాత్ర పోషిస్తోందనే అంశాన్ని ఈ అవార్డులు ప్రతిబింబిస్తున్నాయని ఎస్బీఐ తెలిపింది.