ముంబై: ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ లాభం సెప్టెంబర్ క్వార్టర్లో రూ.251 కోట్లకు దూసుకుపోయింది. రీఇన్సూరెన్స్ పోర్ట్‌ఫోలియో నుంచి వచ్చిన ఒక్కసారి ఆదాయం రూ.170 కోట్ల వల్ల ఈ స్థాయిలో పెరిగింది. వాస్తవానికి అంతకుముందు ఏడాది ఇదే కాలంలో లాభం కేవలం రూ.5.5 కోట్లుగానే ఉండడం గమనార్హం. ప్రీమియం ఆదాయం రూ.690 కోట్ల నుంచి రూ.926 కోట్లకు వృద్ధి చెందింది.
ఇందులో పంటల బీమా నుంచి వచ్చిన ప్రీమియం వాటా రూ.306 కోట్లుగా ఉంది. ‘‘రూ.170 కోట్లు ఏకీకృత ఆదాయం రీఇన్సూరెన్స్ నుంచి రావడంతో రూ.156 కోట్ల అండర్‌రైటింగ్ లాభాన్ని నమోదు చేశాం. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో అండర్‌రైటింగ్ నష్టాలు రూ.78 కోట్ల మేర ఉన్నాయి’’ అని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఎండీ పుషన్ మహపాత్ర తెలిపారు. మోటారు, అగ్నిప్రమాద, వైద్య, పంటల బీమా నుంచి వచ్చిన ప్రీమియం ఆదాయం మెరుగ్గా నమోదైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీమియం ఆదాయంలో 40 శాతం వృద్ధి లక్ష్యాన్ని (రూ.3,600 కోట్లకు) విధించుకున్నట్టు మçహాపాత్ర తెలిపారు. ప్రస్తుతం తమ వార్షిక ప్రీమియం ఆదాయంలో 55 శాతం మేర ఎస్‌బీఐ గ్రూపు, ఇతర ప్రాంతీయ బ్యాంకుల నుంచే వస్తుండగా, భవిష్యత్తులో ఈ వాటాను 50%కి తగ్గించుకోవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. మధ్య కాలానికి ఐపీవోకు రానున్నట్టు ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2,600గా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 20% మేర పెంచుకోనున్నట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment