మూడు సంస్థలపై ఎన్‌సీఎల్‌టీకి ఎస్‌బీఐ
న్యూఢిల్లీ: భారీ స్థాయిలో రుణాలు బాకీపడిన మూడు సంస్థలపై ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ తాజాగా దివాలా చట్టం కింద రుణాల రికవరీ ప్రక్రియ ప్రారంభించింది. ఉక్కు తయారీ సంస్థలు మోనెట్ ఇస్పాత్, ఎలక్ట్రోస్టీల్ స్టీల్స్, విద్యుత్ పంపిణీ సంస్థ జ్యోతి స్ట్రక్చర్స్ ఇందులో ఉన్నట్లు సమాచారం.
రుణాల రికవరీ కోసం మోనెట్ ఇస్పాత్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో ఎస్‌బీఐ కేసు దాఖలు చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. బ్యాంకులకు భారీగా బాకీ పడ్డాయని ఆర్‌బీఐ గుర్తించిన 12 సంస్థల్లో ఈ మూడు కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన మొండిబకాయీల్లో దాదాపు నాలుగో వంతు ఈ సంస్థలు కట్టాల్సినదే ఉంది.