సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు శుభవార్త అందించింది. 2000 ప్రొబెషనరీ ఆఫీసర్ల (పీవో) ఉద్యోగాల భర్తీకి ఎస్‌బీఐ ఏప్రిల్ 21వ నోటిఫికేషన్ విడుదల చేసింది. అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. శనివారంనుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఎస్‌బీఐ వెబ్‌సైట్ అందించిన వివరాలు దరఖాస్తులు సమర్పించేందు కు చివరి తేదీ మే 13, 2018. ప్రిలిమ్స్ పరీక్ష జులై 1, 7,8 తేదీల్లో, మెయిన్స్ పరీక్ష ఆగస్టు 4న నిర్వహించనుంది
పీవో పోస్టులకు నిర్వహించే పరీక్ష మూడు దశల్లో జరుగుతుంది. ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలతో పాటు గ్రూపు డిస్కషన్స్ , ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ప్రిలిమినరీలో ఉత్తీర్ణత పొందినవారు మెయిన్స్‌కు అర్హత సాధిస్తారు. మెయిన్స్ కూడా పాసైతే ఆ అభ్యర్థులను గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం bank.sbi/careers లేదా https://www.sbi.co.in/careers/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment