8 శాతం తగ్గిన ఎస్‌బీఐ నికర లాభం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం నాలుగో త్రైమాసికంలో 8 శాతం పడిపోయింది. ఈ ఏడాది జనవరి-మార్చి(క్యూ4)లో రూ. 3,041 కోట్ల నికర లాభాన్ని సంపాదించింది. అంతకుముందు త్రైమాసికంలో రూ. 3,299 కోట్లు ఆర్జించింది. బ్యాంకు మొత్తం ఆదాయం ఏడాది కాలంలో రూ. 36,331 కోట్ల నుంచి రూ.42,443 కోట్లకు పెరిగింది.
నెట్ ఇంట్రస్ట్ ఆదాయం 16.4 శాతం పెరిగి రూ.12,903 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో ఇది రూ.11,591కోట్లకు పరిమితమైంది. మొండిబకాయిలు పెరగడం వల్ల ఎస్‌బీఐ నికర లాభం తగ్గిపోయింది.