జూమ్‌కార్ నుంచి అద్దెకు కార్లు | Self-drive car rental firm Zoomcar enters Hyderabad | Sakshi
Sakshi News home page

జూమ్‌కార్ నుంచి అద్దెకు కార్లు

Published Wed, May 27 2015 12:28 AM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

జూమ్‌కార్ నుంచి అద్దెకు కార్లు - Sakshi

జూమ్‌కార్ నుంచి అద్దెకు కార్లు

హైదరాబాద్‌లో సెల్ఫ్ డ్రైవింగ్ అద్దె కారు సేవలు ప్రారంభం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న సెల్ఫ్ డ్రైవ్ కారు రెంటల్ కంపెనీ జూమ్‌కార్ హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. గంటలు, రోజులు, నెలల వారీగా కార్లను అద్దెకిస్తామని జూమ్‌కార్ సహవ్యవస్థాకుడు గ్రేగ్ మోరాన్ చెప్పారు. మంగళవారమిక్కడ తన సేవలను విస్తరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం జూమ్‌కార్ బెంగళూరు, పుణే, ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ నగరాల్లో 1,200 కార్లతో సేవలందిస్తుంది.

ఈ ఏడాది ముగింపు నాటికి దేశంలోని 10 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.  కార్ల సంఖ్యను 4,000లకు పెంచుతాం.

* ప్రస్తుతం హైదరాబాద్‌లో 30 కార్లను బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, పంజగుట్ట మొత్తం ఆరు ప్రాంతాల్లో అందుబాటులో పెట్టాం. ఈ ఏడాది ముగింపు కల్లా వీటి సంఖ్యను 1,000కి పెంచి, 100 ప్రాంతాల్లో అందుబాటులో ఉంచుతాం.
* ప్రస్తుతం ఫిగో, స్కార్పియో, ఏకోస్పోర్ట్, ఎక్స్‌యూవీ మొత్తం 4 మోడళ్ల కార్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే 50కి పైగా లగ్జరీ కార్లనూ అద్దెకిచ్చేందుకు రెడీ అవుతున్నాం. వీటి ధరలు గంటకు ఫిగో కారైతే రూ.80, అమేజ్‌కు రూ.95, స్కార్పియో, ఏకోస్పోర్ట్‌కు రూ.110, ఎక్స్‌యూవీకు రూ.140గా నిర్ణయించాం. తొలిసారి బుకింగ్ చేసుకునే వారికి 30% రాయితీ ఇస్తున్నాం. ఈ ధరలోనే ఇంధనం, బీమా, పన్నులు కలిపి ఉంటాయి.
* 7 కార్లతో బెంగళూరు కేంద్రంగా 2013లో ప్రారంభమైన జూమ్‌కార్ సేవలు.. ఇప్పుడు 6 నగరాలకు.. 1,200 కార్లకు విస్తరించింది. ఇప్పటివరకు 11 మిలియన్ డాలర్ల పెట్టుబడులను సమీకరించాం. సిక్వోయా కేపిటల్ గతేడాది అక్టోబర్‌లో 8 మిలియన్ డాలర్ల పెట్టుబడులను పెట్టింది.
* కారును అద్దెకు తీసుకోవాలంటే ముందుగా కొంత మొత్తాన్ని డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.  కారు ధరను బట్టి ఈ మొత్తం రూ.10 వేల నుంచి లక్ష వరకూ ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement