
ఫలించిన గ్రీస్ మంత్రం.. మార్కెట్లకు భారీ లాభం
ముంబై: కొద్దికాలంగా స్టాక్ మార్కెట్లను 'బేర్'మనిపించిన గ్రీస్ రుణ సంక్షభ భయాలు తొలిగిపోవడంతో బుల్ మళ్లీ విజృంభించింది. సోమవారం మార్కెట్లు ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ 414.04 పాయింట్లు లాభపడి 27,730 పాయింట్ల వద్ద ముగిసింది. 1.56 శాతం లాభాలను నమోదు చేసుకున్ననిఫ్టీ 128.15 పాయింట్లు ఆర్జించి 8,353 పాయింట్లకు చేరింది.
దేశవ్యాప్తంగా రుతుపవనాలు ప్రవేశించడంతో మొదట్లో లాభాల బాటలో నడిచిన మార్కెట్లు గ్రీస్ రుణ సంక్షోభం కారణంగా కొద్దిరోజులపాటు కుదేలైంది. ఆర్థిక విపత్తు నుంచి బయటపడేందుకు అవసరమైన చర్యలు చేపట్టేందుకు ఆ దేశ నాయకత్వం సానుకూలంగా ఉందన్న వార్తలు మళ్లీ మార్కెట్లు గాడినపడేందుకు సహకరించాయి.