ముంబై: భారత స్టాక్ మార్కెట్లు రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. మంగళవారం సెన్సెక్స్ 322.39 పాయింట్లు నష్టపోయి 27,797.01 వద్ద ముగిసింది. సెన్సెక్స్ నెలలో కనిష్ట స్థాయికి దిగజారింది. ఇక నిఫ్టీ 97.55 పాయింట్లు కోల్పోయి 8,340.70 వద్ద ముగిసింది.
సోమవారం కూడా స్టాక్ మార్కెట్లు భారీ పతనం చవిచూసిన సంగతి తెలిసిందే. ఇన్ఫోసిస్ దెబ్బకు స్టాక్ మార్కెట్లు 300 పాయింట్లకు పైగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తితోపాటు నందన్‌నిలేకని ఆయన కుటుంబసభ్యులు కలిసి మొత్తం 6 వేల 481కోట్ల రూపాయల విలువైన 33 మిలియన్ షేర్లను అమ్మివేశారు.
మళ్లీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
Published Tue, Dec 9 2014 4:07 PM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement