ముంబై: మిశ్రమ ఆసియా మార్కెట్ నేపథ్యంలో దేశీయ స్టాక్మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఇటీవల లాభాల నేపథ్యంలో మదురపర్లు లాభాల స్వీకరణకు దిగడంతో దలాల్ స్ట్రీట్లో సూచీలు స్వల్పనష్టాలను చవిచూస్తున్నాయి. గత ఆరు సెషన్లలో 881 పాయింట్లు లాభపడంతో ఇన్వెస్టర్లు లాభాలవైపు మొగ్గు చూపారు. బీఎస్ సీ సెన్సెక్స్ 33పాయింట్లు 27,245దగ్గర, ఎన్ఎస్ఇ 19పాయింట్ల నష్టంతో నిఫ్టీ 8,351 వద్ద శాతం ట్రేడ్ అవుతోంది. ఓవర్ బాట్ కారణంగా మార్కెట్లో స్టాక్స్లో లాభాల స్వీకరణ, ఆసియా మార్కెట్ల మిశ్రమ ధోరణి ప్రధానంగా మార్కెట్లను ప్రభావితం చేస్తోందని బ్రోకర్లు తెలిపారు. పవర్ రియాల్టీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ ఐటి సెక్టార్ లో నష్టాల్లో ఉంది. బజాజ్ ఆటో, గెయిల్, ఎన్టిపిసి, టాటా మోటార్స్, భారతీ ఎయిర్టెల్, హీరో మోటార్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, టిసిఎస్, విప్రో షేర్లలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.
అటు కరెన్సీ మార్కెట్లో డాలర్ తో పోలిస్తే రూపాయి 0.11 పైసల నష్టంతో 67.38 దగ్గర ఉంది. అలాగే నిన్న మార్కెట్లో మెరుపులు కురిపించిన బులియన్ మార్కెట్ కూడా రెడ్ లో ఉంది. బంగారం దాదాపు 114 రూపాయలు నష్టంతో 31 వేల669 స్థిరంగా ఉంది.
నష్టాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్లు
Published Tue, Jul 5 2016 10:49 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM
Advertisement