సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా రెపో రేటులో పావు శాతం కోతకు మొగ్గు చూపడంతో ఇన్వెస‍్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. దీంతో సెన్సెక్స్ 532 పాయింట్లు పతనమై 39,550 వద్ద, నిఫ్టీ సైతం 166, పాయింట్లు క్షీణించి 11,855వద్ద ట్రేడవుతోంది. వెరసి సెన్సెక్స్ 40,000, నిఫ్టీ 12,000 పాయింట్ల మార్క్ దిగువకు చేరాయి. కాగా ఆర్‌బీఐ గవర్నర్ శక్తి కాంత్‌నేతృత్వంలోని ఎంపీసీ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.75 శాతంగా నిర‍్ణయించింది. ఇప్పటివరకూ 6 శాతంగా రెపో రేటు అమలవుతోంది. వెరసి 2010 సెప్టెంబర్ తరువాత మళ్లీ రెపో రేటు 6 శాతం దిగువకు చేరడం విశేషం.
పీఎస్‌యూ, ప్రయివేట్ బ్యాంక్స్, ఫార్మా, మీడియా నష్టపోతున్నాయి. గెయిల్ 9.5 శాతం పతనంకాగా.. ఐబీ హౌసింగ్, ఇండస్‌ఇండ్, గ్రాసిమ్, అల్ట్రాటెక్, యస్ బ్యాంక్, వేదాంతా, టెక్ మహీంద్రా, ఎంఅండ్‌ఎం 6-1.6 శాతం మధ్య బలహీనపడ్డాయి. అయితే ఏషియన్ పెయింట్స్, హెచ్‌యూఎల్, కోల్ ఇండియా, టైటన్, పవర్‌గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్, ఓఎన్‌జీసీ లాభాల్లో కొనసాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment