రికార్డు స్థాయిలో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
ముంబై: స్టాక్ మార్కెట్ సూచీలు వారాంతంలో సరికొత్త రికార్డు స్థాయి వద్ద ముగిశాయి. బీఎస్ఈ సూచీ సెన్సెక్స్ 267 పాయింట్లు లాభపడి 28,334 వద్ద స్థిరపడింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ 75 పాయింట్లు ఎగసి 8,477 వద్ద ఆగింది. బ్యాంకు షేర్లు ర్యాలీతో మార్కెట్ ముందుకు దూసుకుపోయింది.
కొటక్ మహీంద్ర బ్యాంకులో ఐఎన్జీ వైశ్య బ్యాంకు విలీనం అంశం బ్యాంకు షేర్లకు ఊతమిచ్చింది. ట్రేడింగ్ ఆరంభం నుంచి లాభాల్లో పయనించిన మార్కెట్ చివరివరకు అదే ఊపు కొనసాగించి కొత్తస్థాయిని అందుకుంది. బ్యాంకు షేర్లతో పాటు కన్జుమర్ డ్యురబుల్, హెల్త్ కేర్, మెటల్, ఆటో, ఆయిల్, గ్యాస్ షేర్లు కూడా లాభాలు నమోదు చేశాయి.