
స్టాక్ మార్కెట్లు (ప్రతీకాత్మక చిత్రం)
ముంబై : ట్రేడింగ్ ప్రారంభంలో ధూంధాం అని దుమ్మురేపిన దలాల్‌స్ట్రీట్... చివరికి ఆ దూకుడును తగ్గించుకుంది. సెన్సెక్స్ సరికొత్త గరిష్టంలోనే ముగియగా... నిఫ్టీ మాత్రం ఫ్లాట్‌గా క్లోజైంది. 51 పాయింట్ల లాభంలో సెన్సెక్స్ 38,337 వద్ద సరికొత్త గరిష్టాన్ని నమోదు చేసింది. నిఫ్టీ 12 పాయింట్ల లాభంలో 11,550కి పైన 11,582 వద్ద స్థిరపడింది. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఎక్కువగా లాభాలు పండించాయి. బ్యాంక్స్, మెటల్స్, ఆటో బలహీనపడ్డాయి. రంగాల వారీగా మెటల్స్, పీఎస్‌యూ బ్యాంక్‌లే నేడు అతిపెద్ద లూజర్లుగా ఉన్నాయి. స్టాక్స్‌లో లార్సెన్ అండ్ టూబ్రో, ఎన్‌టీపీసీ, టెక్ మహింద్రా టాప్ గెయినర్లుగా నిలువగా.. టాటా మోటార్స్, వేదంత, బీపీసీఎల్ ఎక్కువగా నష్టపోయాయి.
ఓ వైపు దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు గరిష్టాలతో దూసుకుపోతుండగా.. మరోవైపు కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా తొలిసారి 8 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను దాటేసింది. దీంతో దేశంలోనే అతిపెద్ద లిస్టెడ్ కంపెనీగా అవతరించింది. లార్సెన్ అండ్ టూబ్రో(ఎల్ అండ్ టీ) కూడా తన చరిత్రలోనే తొలిసారి 9వేల కోట్ల షేర్లను బైబ్యాక్ చేస్తున్నట్టు ప్రకటించింది. టెండర్ ఆఫర్ ద్వారా బైబ్యాక్‌ను చేపట్టనున్నట్లు తెలియజేసింది. దీంతో ఎల్ అండ్ టీ షేర్ దూసుకుపోయింది. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 28 పైసల నష్టంలో 70.11 వద్ద ఉంది.
Comments
Please login to add a commentAdd a comment